Telugu Global
Health & Life Style

ఆ ఇష్టం.... పుట్టుక‌తోనే వ‌స్తుందా!

కొంత‌మంది వ్యాయామం అంటే బాగా ఇష్ట‌ప‌డుతుంటారు. కొంత‌మంది మాత్రం ఎంత ప్ర‌య‌త్నించినా వ్యాయామాన్ని అల‌వాటు చేసుకోలేరు. ఇందుకు కార‌ణాలు పుట్టుక‌లోనే ఉంటాయ‌ని, వ్యాయామం ప‌ట్ల త‌ల్లికి ఉన్న అభిరుచి, త‌ల్లిలోని  చురుకుద‌న‌మే పిల్లల్లో ఈ విష‌యాన్ని నిర్దారిస్తుంద‌ని అమెరికా శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. టెక్సాస్ పిల్ల‌ల ఆసుప‌త్రి వైద్యులు దీనిపై అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించారు. ఎలుక‌ల మీద నిర్వ‌హించిన ఓ ప‌రిశోధ‌న ద్వారా వారు ఈ విష‌యాన్ని నిర్దారించారు. మామూలుగా బాగా చురుగ్గా ప‌రుగులు తీస్తున్న ఎలుక‌ల‌ను రెండు గ్రూపులుగా […]

ఆ ఇష్టం.... పుట్టుక‌తోనే వ‌స్తుందా!
X

కొంత‌మంది వ్యాయామం అంటే బాగా ఇష్ట‌ప‌డుతుంటారు. కొంత‌మంది మాత్రం ఎంత ప్ర‌య‌త్నించినా వ్యాయామాన్ని అల‌వాటు చేసుకోలేరు. ఇందుకు కార‌ణాలు పుట్టుక‌లోనే ఉంటాయ‌ని, వ్యాయామం ప‌ట్ల త‌ల్లికి ఉన్న అభిరుచి, త‌ల్లిలోని చురుకుద‌న‌మే పిల్లల్లో ఈ విష‌యాన్ని నిర్దారిస్తుంద‌ని అమెరికా శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. టెక్సాస్ పిల్ల‌ల ఆసుప‌త్రి వైద్యులు దీనిపై అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించారు.

ఎలుక‌ల మీద నిర్వ‌హించిన ఓ ప‌రిశోధ‌న ద్వారా వారు ఈ విష‌యాన్ని నిర్దారించారు. మామూలుగా బాగా చురుగ్గా ప‌రుగులు తీస్తున్న ఎలుక‌ల‌ను రెండు గ్రూపులుగా విడ‌గొట్టారు. ఒక గ్రూపు ఎలుక‌ల‌కు అవి గ‌ర్భిణితో ఉన్న‌పుడు అంత‌కుముందు కూడా బాగా ప‌రిగెత్తే అవకాశాన్ని క‌ల్పించారు. మ‌రో భాగం ఎలుక‌ల‌ను ప‌రిగెత్త‌కుండా నియంత్రించారు.

వాటికి పిల్ల‌లు క‌లిగాక ప‌రిశీలించిన‌పుడు చురుగ్గా ప‌రుగులు తీసిన ఎలుక‌ల‌కు పుట్టిన పిల్ల‌లు, ప‌రిగెత్తే అవ‌కాశం లేని ఎలుక‌ల‌కు పుట్టిన పిల్ల‌ల కంటే 50 శాతం ఎక్కువ‌ చురుగ్గా ఉన్న‌ట్టుగా గ‌మ‌నించారు. ఆ చురుకుద‌నం, బ‌ద్ద‌కం ఎలుక‌లు పెరుగుతున్న కొద్దీ పెరిగిన‌ట్టుగా కూడా గుర్తించారు. దీన్ని బ‌ట్టి తాము చురుగ్గా ఉంటే, వ్యాయామాలు చేస్తుంటే ఆ అల‌వాటు త‌మ పిల్ల‌లకు జీవితాంతం మేలు చేస్తుంద‌ని త‌ల్లులు గుర్తించాల‌ని ఆ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. త‌ల్లులు వ్యాయామం ప‌ట్ల ఇష్టంతో ఉంటే, గ‌ర్భంతో ఉన్న‌పుడు, అంత‌కుముందూ వ్యాయామం చేస్తుంటే, పిల్ల‌ల‌కూ ఆ అభిరుచి జీన్స్ ద్వారా సంక్రమిస్తుంద‌నే విష‌యాన్ని త‌ల్లులంతా గుర్తుపెట్టుకోవాల‌ని వారు స‌ల‌హా ఇస్తున్నారు. పిల్లల్లో ఒబేసిటీకి, మ‌ధుమేహం వ్యాధి పెరుగుద‌లకు త‌ల్లుల్లో వ్యాయామం ప‌ట్ల ఉన్న అనాస‌క్తి కూడా ఒక కార‌ణ‌మ‌ని వారు చెబుతున్నారు.

First Published:  29 April 2016 7:29 AM GMT
Next Story