Telugu Global
Cinema & Entertainment

పెళ్లి హ‌డావుడి లో నాగ చైత‌న్య‌...!

ఎస్ మీరు చ‌దువుతున్న‌ది కరెక్టే. యువ హీరో నాగ చైత‌న్య పెళ్లి సంద‌డి లో వున్నాడు. త‌ను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే ప‌నిలో వున్నాడు. ఇదేంటి .. అస‌లు స‌ప్పుడు లేకుండా నాగ‌చైత‌న్య పెళ్లి జ‌ర‌గ‌డం ..అందునా ల‌వ్ మ్యారేజ్ .. ఎలా జ‌ర‌గుతుంది అనే డౌట్ వ‌చ్చిందా..? అంతా నిజ‌మే కానీ.. రియ‌ల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో జ‌ర‌గుతుంది. గ‌త యేడాది మ‌ల‌యాళంలో ప్రేమ‌మ్ పేరు తో వ‌చ్చిన ఒక […]

పెళ్లి హ‌డావుడి లో నాగ చైత‌న్య‌...!
X

ఎస్ మీరు చ‌దువుతున్న‌ది కరెక్టే. యువ హీరో నాగ చైత‌న్య పెళ్లి సంద‌డి లో వున్నాడు. త‌ను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే ప‌నిలో వున్నాడు. ఇదేంటి .. అస‌లు స‌ప్పుడు లేకుండా నాగ‌చైత‌న్య పెళ్లి జ‌ర‌గ‌డం ..అందునా ల‌వ్ మ్యారేజ్ .. ఎలా జ‌ర‌గుతుంది అనే డౌట్ వ‌చ్చిందా..? అంతా నిజ‌మే కానీ.. రియ‌ల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో జ‌ర‌గుతుంది.

గ‌త యేడాది మ‌ల‌యాళంలో ప్రేమ‌మ్ పేరు తో వ‌చ్చిన ఒక ఫీల్ గూడ్ చిత్రం అక్క‌డ ఘ‌న విజ‌యం సాధించింది. అదే చిత్రాన్ని కార్తీకేయ ఫేమ్ చందు మొండేటి అదే పేరు తో తెలుగులో రీమేక్ చే్స్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైత‌న్య‌, శృతిహాస‌న్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా లో క్లైమాక్స్ స‌న్నివేశాలైన పెళ్లి స‌న్నివేశాలు ప్ర‌స్తుతం రామోజి ఫిల్మ్ సిటిలో షూట్ చేస్తున్నారు. కాలేజి నేప‌థ్యం గా వ‌స్తున్న ఈ రీమేక్ చిత్రం ఏ మేర‌కు అభిమానుల్ని అల‌రిస్తుందో చూడాలి.

First Published:  29 April 2016 2:04 AM GMT
Next Story