Telugu Global
International

ఇక నో క‌రెంటు...నో ఛార్జ‌ర్‌...ఓన్లీ గాలి!

టెక్నాల‌జీ ఎంతగా ముందుకు వెళుతున్నా, మ‌రింత స్మార్ట్ ఫీచ‌ర్లు ఉన్న గాడ్జెట్లు మార్కెట్లోకి వ‌స్తున్నా, బ్యాట‌రీ బ్యాక‌ప్ అనే స‌మ‌స్య మాత్రం అలాగే ఉంటోంది. ఎంత‌గొప్ప ఫోన్‌కైనా ఛార్జ‌రు, క‌రెంటు త‌ప్ప‌నిస‌రి. ఈ స‌మ‌స్య‌పై దృష్టి పెట్టారు యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌,  నెదర్లాండ్స్‌, డెల్ట్ఫ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలకు చెందిన ఎలక్ట్రికల్‌ పరిశోధకులు. వీరు ఐడెంటిఫికేషన్‌ అండ్‌ సెన్సింగ్‌ ప్లాట్‌ఫాం(విస్ప్‌) అనే చిప్‌ను త‌యారుచేశారు. ఈ చిప్‌తో గాడ్జెట్లు బ్యాట‌రీ లేకుండానే ప‌నిచేస్తాయి. దీనికి ప్ల‌గ్ అక్క‌ర్లేదు, […]

ఇక నో క‌రెంటు...నో ఛార్జ‌ర్‌...ఓన్లీ గాలి!
X

టెక్నాల‌జీ ఎంతగా ముందుకు వెళుతున్నా, మ‌రింత స్మార్ట్ ఫీచ‌ర్లు ఉన్న గాడ్జెట్లు మార్కెట్లోకి వ‌స్తున్నా, బ్యాట‌రీ బ్యాక‌ప్ అనే స‌మ‌స్య మాత్రం అలాగే ఉంటోంది. ఎంత‌గొప్ప ఫోన్‌కైనా ఛార్జ‌రు, క‌రెంటు త‌ప్ప‌నిస‌రి. ఈ స‌మ‌స్య‌పై దృష్టి పెట్టారు యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌, నెదర్లాండ్స్‌, డెల్ట్ఫ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలకు చెందిన ఎలక్ట్రికల్‌ పరిశోధకులు. వీరు ఐడెంటిఫికేషన్‌ అండ్‌ సెన్సింగ్‌ ప్లాట్‌ఫాం(విస్ప్‌) అనే చిప్‌ను త‌యారుచేశారు. ఈ చిప్‌తో గాడ్జెట్లు బ్యాట‌రీ లేకుండానే ప‌నిచేస్తాయి. దీనికి ప్ల‌గ్ అక్క‌ర్లేదు, విద్యుత్ స‌దుపాయం కోసం వెతుక్కోవాల్సిన ప‌నిలేదు. ఈ చిప్, గాల్లోని రేడియో త‌రాంగాల‌ను గ్ర‌హించి విద్యుత్‌గా మార్చుకుంటుంది. దాన్నిగాడ్జెట్‌కి అందిస్తుంది. ఈ చిప్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎప్పుడు వ‌స్తుందో, ఎంత ఖ‌రీదు ఉంటుందో తెలియ‌దు. ఇది విస్తృతంగా అందుబాటులోకి వ‌స్తే మాత్రం స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్‌లెట్లు వంటి వాటికి ఎంత ఉప‌యోగ‌క‌ర‌మో చెప్ప‌న‌క్క‌ర్లేదు క‌దా!

First Published:  29 April 2016 2:00 AM GMT
Next Story