Telugu Global
Cinema & Entertainment

నాగార్జున సినిమాలో కంచె హీరోయిన్

కంచె సినిమాలో జమీందార్ కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించిది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమాతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. కానీ కంచె తర్వాత ప్రగ్యాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాల్లో ఆఫర్లు ఇలా వచ్చి ఆలా చేజారిపోయాయి. దీంతో ఆమె కెరీర్ పరంగా కాస్త ఎత్తుపల్లాలు చవిచూస్తోంది. ఇలాంటి టైమ్ లో ఊహించని ఆఫర్ అందుకుంది ప్రగ్యా. నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రాబోతున్న ఓ నమో వెంకటేశాయ అనే సినిమాలో ఓ కీలక పాత్ర […]

నాగార్జున సినిమాలో కంచె హీరోయిన్
X
కంచె సినిమాలో జమీందార్ కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించిది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమాతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. కానీ కంచె తర్వాత ప్రగ్యాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాల్లో ఆఫర్లు ఇలా వచ్చి ఆలా చేజారిపోయాయి. దీంతో ఆమె కెరీర్ పరంగా కాస్త ఎత్తుపల్లాలు చవిచూస్తోంది. ఇలాంటి టైమ్ లో ఊహించని ఆఫర్ అందుకుంది ప్రగ్యా. నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రాబోతున్న ఓ నమో వెంకటేశాయ అనే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రగ్యాను ఎంపిక చేశారు. హథీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రగ్యా ఓ కీలక పాత్ర పోషించనుంది.
జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. సినిమాలో పాత్రకు సంబంధించి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కంచె హీరోయిన్ మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. ఎలా సన్నద్ధమవ్వాలో రాఘవేంద్రరావు పూర్తిగా వివరించారు. మరోవైపు కీరవాణి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 3పాటల్ని స్వరపరిచారు. నాగార్జుతో గతంలో శిరిడీసాయి సినిమా తీసిన మహేష్ రెడ్డి… తాజా భక్తిరస చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు.
First Published:  24 April 2016 12:28 AM GMT
Next Story