Telugu Global
National

వీర సైనికుడి గుండె...బేజారు!

దేశ స‌రిహ‌ద్దుల్లో అనుక్ష‌ణం అప్ర‌మత్తంగా కాప‌లా కాసే భ‌ద్ర‌తా సిబ్బంది ఎంత ఒత్తిడికి గుర‌వుతున్నారో ఈ వివ‌రాలు వెల్ల‌డిస్తున్నాయి. స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాల్లో ఈ ఏడాది మొత్తం 400 మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా అందులో 70మంది గుండెపోటుతోనే మృతి చెందారు. మ‌రో 50మంది రోడ్డు ప్ర‌మాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అంటే మొత్తం మ‌ర‌ణాల్లో 30శాతం వ‌ర‌కు ఈ రెండింటి కార‌ణంగానే సంభ‌వించాయి. బోర్డ‌ర్ సెక్యురిటీ ఫోర్సు  డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ కెకె శ‌ర్మ ఈ విష‌యం మీద సైనికుల‌తో మాట్లాడారు. […]

వీర సైనికుడి గుండె...బేజారు!
X

దేశ స‌రిహ‌ద్దుల్లో అనుక్ష‌ణం అప్ర‌మత్తంగా కాప‌లా కాసే భ‌ద్ర‌తా సిబ్బంది ఎంత ఒత్తిడికి గుర‌వుతున్నారో ఈ వివ‌రాలు వెల్ల‌డిస్తున్నాయి. స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాల్లో ఈ ఏడాది మొత్తం 400 మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా అందులో 70మంది గుండెపోటుతోనే మృతి చెందారు. మ‌రో 50మంది రోడ్డు ప్ర‌మాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అంటే మొత్తం మ‌ర‌ణాల్లో 30శాతం వ‌ర‌కు ఈ రెండింటి కార‌ణంగానే సంభ‌వించాయి. బోర్డ‌ర్ సెక్యురిటీ ఫోర్సు డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ కెకె శ‌ర్మ ఈ విష‌యం మీద సైనికుల‌తో మాట్లాడారు. భార‌త్ పాక్ అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు ప్రాంతం జైస‌ల్మీర్‌లో సైనిక ద‌ళాల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, భ‌ద్ర‌త ప‌రంగా అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉంటూనే వారి ఆరోగ్యంప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని అల‌వ‌ర‌చుకోవాల‌ని, డ్రైవింగ్ చేసేట‌పుడు మెల‌కువ‌గా ఉండాల‌ని కోరారు. ఇంకా జ‌వాన్ల‌లో ఒత్తిడిని పెంచుతున్న అనేక అంశాల ప‌ట్ల ఆయ‌న స్పందించారు. స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా విధుల్లో ఉన్న కొత్త‌గా పెళ్ల‌యిన వారికి ప్రత్యేకంగా వ‌స‌తి ఏర్పాట్లు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు.

భ‌ద్ర‌తా నిర్వ‌హ‌ణ‌లో టెక్నాల‌జీని విస్తృతంగా వినియోగించుకోవాల‌ని, స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త విష‌యంలో స్మార్ట్‌ఫోన్ల‌ను వినియోగించుకునేలా ఓ నూత‌న విధానాన్ని అమ‌ల్లోకి తేనున్నామ‌ని చెప్పారు. అలాగే సైనికులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

First Published:  23 April 2016 11:25 PM GMT
Next Story