Telugu Global
Cinema & Entertainment

 పైకి ఒకటి చెప్పి... లోపల ఇంకోటి కవర్ చేస్తాడట...

శ్రీజ పెళ్లి అయిన వెంటనే చిరంజీవి 150వ సినిమా ఉంటుందని అభిమానులు ఎదురుచూశారు. కానీ పెళ్లయి ఇన్ని రోజులైనా చిరంజీవి మాత్రం ఆ విషయం ఎత్తడం లేదు. పబ్లిక్ లో కనిపిస్తున్నాడే కానీ తన సినిమా గురించి మాత్రం మాట్లాడ్డం లేదు. ఇప్పటికే దాదాపు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న అభిమానులు ఇక ఎక్కువ కాలం ఎదురుచూడలేకపోతున్నారు. వాళ్లలో కూడా సహనం నశించిపోయింది. ఈ విషయాన్ని మెగాస్టార్ కూడా పసిగట్టాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే కథ ఇంకా […]

 పైకి ఒకటి చెప్పి... లోపల ఇంకోటి కవర్ చేస్తాడట...
X
శ్రీజ పెళ్లి అయిన వెంటనే చిరంజీవి 150వ సినిమా ఉంటుందని అభిమానులు ఎదురుచూశారు. కానీ పెళ్లయి ఇన్ని రోజులైనా చిరంజీవి మాత్రం ఆ విషయం ఎత్తడం లేదు. పబ్లిక్ లో కనిపిస్తున్నాడే కానీ తన సినిమా గురించి మాత్రం మాట్లాడ్డం లేదు. ఇప్పటికే దాదాపు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న అభిమానులు ఇక ఎక్కువ కాలం ఎదురుచూడలేకపోతున్నారు. వాళ్లలో కూడా సహనం నశించిపోయింది. ఈ విషయాన్ని మెగాస్టార్ కూడా పసిగట్టాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే కథ ఇంకా రెడీ కాలేదు. హీరోయిన్ కూడా ఫైనలైజ్ కాలేదు. మరి ఇలాంటి టైమ్ లో సినిమాను ఎలా పట్టాలపైకి తీసుకురావడం.
దీనికోసమే తన అనుభవాన్నంతా రంగరించి అద్భుతమైన మాస్టర్ ప్లాన్ సిద్ధంచేశాడట చిరంజీవి. కథ, స్క్రీన్ ప్లే పనులు ఓవైపు జరుగుతున్నప్పటికీ… అభిమానుల్లో ఉత్సాహం నింపేదుకు 150వ సినిమాకు కొబ్బరికాయ కొట్టాలని నిర్ణయించుకున్నాడట. కథ సిద్ధంకాకపోయినా… ముందు సినిమాను ప్రారంభించినట్టు కటింగ్ ఇస్తే అభిమానులు శాంతిస్తారని, పైగా అంచనాలు కూడా పెరుగుతాయని చిరంజీవి భావిస్తున్నారట. మెగా ఐడియా బాగానే ఉంది కానీ… కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా ఎక్కువ గ్యాప్ ఇస్తే అవే అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం కూడా ఉంది.
Click on Image to Read:
allu-arjun
pawan-niharika
boyapati
balakrishna-kajal
First Published:  22 April 2016 9:58 PM GMT
Next Story