పవన్ కల్యాణ్ సొంత ఛానెల్?
తన దగ్గర అస్సలు డబ్బు లేదని ఈమధ్య చెప్పుకొచ్చాడు పవన్. తన స్టాఫ్ కు జీతాలు ఇవ్వడానికి, తన మెయింటెనెన్స్ కు మాత్రమే సరిపోతున్నాయని బాధపడ్డాడు. సో… జనసేన పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేయడానికి తన దగ్గర డబ్బులేదని ప్రకటించాడు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ కోటరీ నుంచి మరో వార్త బయటకొచ్చింది. రాబోయే రెండేళ్లలో ఎలాగోలా జనసేన పార్టీని మూలాల నుంచి బలోపేతం చేయడంతో పాటు…. కుదిరితే ఓ టీవీ ఛానెల్ లేదా వార్తాపత్రికను పెట్టే […]
BY sarvi22 April 2016 6:41 AM GMT
X
sarvi Updated On: 22 April 2016 6:52 AM GMT
తన దగ్గర అస్సలు డబ్బు లేదని ఈమధ్య చెప్పుకొచ్చాడు పవన్. తన స్టాఫ్ కు జీతాలు ఇవ్వడానికి, తన మెయింటెనెన్స్ కు మాత్రమే సరిపోతున్నాయని బాధపడ్డాడు. సో… జనసేన పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేయడానికి తన దగ్గర డబ్బులేదని ప్రకటించాడు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ కోటరీ నుంచి మరో వార్త బయటకొచ్చింది. రాబోయే రెండేళ్లలో ఎలాగోలా జనసేన పార్టీని మూలాల నుంచి బలోపేతం చేయడంతో పాటు…. కుదిరితే ఓ టీవీ ఛానెల్ లేదా వార్తాపత్రికను పెట్టే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పవన్ ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ పూర్తిచేసినట్టు చెబుతున్నారు. అయితే పవన్ ఒక్కడే ఈ పనికి పూనుకోలేదనే విషయం ఆయన గత ప్రకటనలు చూస్తే అర్థమైపోతుంది.
సో… పవన్ టీవీ లేదా పత్రిక పెడితే… దానివెనక ఎవరో ఒకరు కచ్చితంగా ఉండే ఉంటారు. అది ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. శరత్ మరార్ కు నష్టాలు వచ్చాయి కాబట్టి.. వెంటనే ఎస్ జే సూర్యతో సినిమా చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. లేకపోతే… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోవాలనుకున్నాడు. కాబట్టి ఎస్ జే సూర్యతో సినిమా కంప్లీట్ అయిన వెంటనే జనసేన పార్టీ బలోపేతంపై… పవన్ పెట్టబోయే మీడియా సంస్థపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం. పవన్ కల్యాణ్ అనుచరులు, మిత్రుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం…. 2019 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పార్టీని పవన్ రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈలోగా టీవీ ఛానెల్ లేదా న్యూస్ పేపర్ ను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Next Story