Telugu Global
Health & Life Style

అదో విష‌వ‌ల‌యం...బ‌య‌ట‌ప‌డండి!

రాత్రులు నిద్ర‌పోకుండా ప‌గ‌లంతా తూలుతుంటారు కొంద‌రు. రాత్రి నిద్ర‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే అలా జ‌రుగుతుంద‌ని అనుకుంటారు. కానీ అందుకు కార‌ణం అదొక్క‌టే కాద‌ని,  నిద్ర‌లేమి ఉన్న‌పుడు కొవ్వు ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాల‌ను తినాల‌నిపిస్తుంద‌ని, అలా తిన‌టం వ‌ల‌న కూడా ప‌గ‌లు మ‌త్తుగా ఉంటార‌ని  ఆస్ట్రేలియాలోని అడ‌లైడ్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు అంటున్నారు. నిద్రలేమికి దారితీసే అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వీరు ప‌రిశోధ‌న‌లు చేశారు. అత్య‌ధికంగా కొవ్వుతో కూడిన ప‌దార్థాలను తీసుకున్న‌వారు స్నీప్ ఆప్నియా అనే నిద్ర‌లేమి డిజార్డ‌ర్‌కి గుర‌వుతున్న‌ట్టుగా […]

అదో విష‌వ‌ల‌యం...బ‌య‌ట‌ప‌డండి!
X

రాత్రులు నిద్ర‌పోకుండా ప‌గ‌లంతా తూలుతుంటారు కొంద‌రు. రాత్రి నిద్ర‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే అలా జ‌రుగుతుంద‌ని అనుకుంటారు. కానీ అందుకు కార‌ణం అదొక్క‌టే కాద‌ని, నిద్ర‌లేమి ఉన్న‌పుడు కొవ్వు ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాల‌ను తినాల‌నిపిస్తుంద‌ని, అలా తిన‌టం వ‌ల‌న కూడా ప‌గ‌లు మ‌త్తుగా ఉంటార‌ని ఆస్ట్రేలియాలోని అడ‌లైడ్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు అంటున్నారు. నిద్రలేమికి దారితీసే అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వీరు ప‌రిశోధ‌న‌లు చేశారు. అత్య‌ధికంగా కొవ్వుతో కూడిన ప‌దార్థాలను తీసుకున్న‌వారు స్నీప్ ఆప్నియా అనే నిద్ర‌లేమి డిజార్డ‌ర్‌కి గుర‌వుతున్న‌ట్టుగా గ‌మ‌నించారు. మ‌రొక‌వైపు నిద్ర‌లేమికి గుర‌వుతున్న‌వారు శ‌క్తిని కోల్పోయిన‌ట్టుగా ఫీల‌వుతూ, దాంట్లోంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఎక్కువ కొవ్వు, పిండిప‌దార్థాల‌ను తీసుకుంటార‌ని వీరు చెబుతున్నారు.

అంటే ఈ ప‌రిస్థితిని వారు ఒక విష‌వ‌ల‌యంగా వ‌ర్ణిస్తున్నారు. నిద్ర‌లేమి ఉంటే ఫ్యాట్ ఫుడ్ తిన‌టం, ఫ్యాట్‌ఫుడ్‌ని తీసుకోవ‌టం వ‌ల‌న నిద్ర‌లేమికి గురికావ‌డం…ఇవి రెండూ ఒక వ‌ల‌యంలా ఒక‌దానిమీద ఒకటి ఆధార‌ప‌డి జ‌రిగిపోతాయ‌ని ఈ శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితి ఉంటే త‌ప్పనిస‌రిగా మంచి ఆహారం తీసుకోవాల‌ని, అప్పుడే ఈ విష‌వ‌ల‌యం నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని వారు స‌ల‌హా ఇస్తున్నారు.

First Published:  22 April 2016 9:10 AM GMT
Next Story