Telugu Global
Cinema & Entertainment

పవన్ ను మించిపోయిన నిహారిక

పవన్ కల్యాణ్ కు తిరుగులేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ అయినా, సినిమా వసూళ్లయినా పవన్ కల్యాణ్ ట్రెండ్ సెట్టర్. అలాంటి పవన్ ను నిన్నగాక మొన్న వచ్చిన నిహారిక ఓడించింది. కీలకమైన ఒక విషయంలో ఏకంగా పవర్ స్టార్ నే వెనక్కినెట్టింది. నాగబాబు కూతురుగా, బుల్లితెర స్టార్ గా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న నిహారిక… సోషల్ మీడియాలో మాత్రం నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇంటర్నెట్ లో ఆమెకున్న ఫాలోయింగ్ ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఈ […]

పవన్ ను మించిపోయిన నిహారిక
X
పవన్ కల్యాణ్ కు తిరుగులేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ అయినా, సినిమా వసూళ్లయినా పవన్ కల్యాణ్ ట్రెండ్ సెట్టర్. అలాంటి పవన్ ను నిన్నగాక మొన్న వచ్చిన నిహారిక ఓడించింది. కీలకమైన ఒక విషయంలో ఏకంగా పవర్ స్టార్ నే వెనక్కినెట్టింది. నాగబాబు కూతురుగా, బుల్లితెర స్టార్ గా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న నిహారిక… సోషల్ మీడియాలో మాత్రం నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ లో ఆమెకున్న ఫాలోయింగ్ ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కూడా మినహాయింపు కాదు. ఉగాది సందర్భంగా ఓ టెలివిజన్ ఛానెల్ కు పవన్ తో పాటు నిహారిక కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ కోసం పవన్ ఇంటర్వ్యూ ఇస్తే… తన డెబ్యూ మూవీ ఒక మనసుతో పాటు తన మనసులో భావాలు పంచుకుంటూ నిహారిక కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ రెండు ఇంటర్వ్యూల్లో అత్యధికంగా నిహారికకే ఎక్కువ మార్కులు పడ్డాయి. నెట్ లో పవన్ ను కేవలం 2లక్షల మంది చూస్తే…. నిహారికను ఏకంగా 8లక్షల మంది చూశారు. అలా పవన్ ను నిహారిక అధిగమించేసింది.
First Published:  21 April 2016 5:13 AM GMT
Next Story