Telugu Global
Cinema & Entertainment

బాలయ్యకు నో చెప్పిన హాట్ బ్యూటీ

మగధీర సినిమాలో రాకుమారి మిత్రవిందగా నటించింది మెప్పించింది. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా రాజకుటుంబానికి చెందిన యువతిగా కనిపించింది. కాబట్టి చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణలో కాజల్ ను తీసుకుంటే మైలేజీ పెరుగుతుందని బాలయ్య భావించాడు. సినిమాకు హెల్ప్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేశాడు. భారీగా రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ఎంత ఊరించిన కాజల్ మాత్రం లొంగలేదు. ఏమాత్రం ఆలోచించకుండా బాలయ్య ప్రాజెక్టుకు నో చెప్పేసింది. తను […]

బాలయ్యకు నో చెప్పిన హాట్ బ్యూటీ
X
మగధీర సినిమాలో రాకుమారి మిత్రవిందగా నటించింది మెప్పించింది. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా రాజకుటుంబానికి చెందిన యువతిగా కనిపించింది. కాబట్టి చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణలో కాజల్ ను తీసుకుంటే మైలేజీ పెరుగుతుందని బాలయ్య భావించాడు. సినిమాకు హెల్ప్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేశాడు. భారీగా రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ఎంత ఊరించిన కాజల్ మాత్రం లొంగలేదు. ఏమాత్రం ఆలోచించకుండా బాలయ్య ప్రాజెక్టుకు నో చెప్పేసింది. తను ప్రస్తుతం బిజీగా ఉన్నానని, కాల్షీట్లు ఇవ్వలేనని తప్పించుకుంది. దీంతో షాకవ్వడం బాలయ్య వంతయింది. ఎందుకంటే తెలుగులో ఆమెకు అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. అటు హిందీలో కూడా కాజల్ పరిస్థితి ఏం బాలేదు. కాబట్టి తన సినిమాలో నటించడానికి కచ్చితంగా ఒప్పుకుంటుందని బాలయ్య ఊహించాడు. కానీ కాజల్ మాత్రం బాలయ్యతో నటిస్తే ఉన్న క్రేజ్ కూడా గంగలో కలిసిపోతుందని భయపడింది. మరీ ముఖ్యంగా బాలయ్యతో చేసిన తర్వాత క్రేజ్ సంగతి అటుంచి, ఏకంగా కెరీర్ నే ఫణంగా పెట్టాల్సి వస్తుందనే విషయం కాజల్ కు తెలుసు. అందుకే తప్పుకుందని అంటున్నారు విశ్లేషకులు.
First Published:  21 April 2016 5:15 AM GMT
Next Story