Telugu Global
Cinema & Entertainment

ఆ విషయంలో పవన్ కంటే బన్నీకే క్రేజ్ ఎక్కువ

మెగా ఫ్యామిలీ హీరోస్ లో ప్రస్తుతానికి పవన్ ను మించినోడు లేడు. మిగతా హీరోలతో కంపేరిజన్ ను కాసేపు పక్కనపెడితే… మెగా కాంపౌండ్ లో మాత్రం నంబర్ వన్ పవన్ కల్యాణే. ఈ విషయాన్ని ఏ మెగా హీరో అయినా ఒప్పుకుంటాడు. అయితే ఒకే ఒక్క విషయంలో మాత్రం ఈ నంబర్ వన్ కుర్చీ కాస్త కదిలింది. పవన్ స్థానంలోకి బన్నీ వచ్చి చేరాడు. ప్రతి విభాగంలో మొన్నటివరకు పవన్ కల్యాణ్ నంబర్ వన్ అనిపించుకున్నాడు. కానీ […]

ఆ విషయంలో పవన్ కంటే బన్నీకే క్రేజ్ ఎక్కువ
X
మెగా ఫ్యామిలీ హీరోస్ లో ప్రస్తుతానికి పవన్ ను మించినోడు లేడు. మిగతా హీరోలతో కంపేరిజన్ ను కాసేపు పక్కనపెడితే… మెగా కాంపౌండ్ లో మాత్రం నంబర్ వన్ పవన్ కల్యాణే. ఈ విషయాన్ని ఏ మెగా హీరో అయినా ఒప్పుకుంటాడు. అయితే ఒకే ఒక్క విషయంలో మాత్రం ఈ నంబర్ వన్ కుర్చీ కాస్త కదిలింది. పవన్ స్థానంలోకి బన్నీ వచ్చి చేరాడు. ప్రతి విభాగంలో మొన్నటివరకు పవన్ కల్యాణ్ నంబర్ వన్ అనిపించుకున్నాడు. కానీ మొట్టమొదటి సారి శాటిలైట్ హక్కుల విషయంలో పవన్ ను క్రాస్ చేశాడు అల్లు అర్జున్. పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా శాటిలైట్ హక్కులు 13 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన విషయం అందరికీ తెలిసిందే. అంత మొత్తం పెట్టి ఈ హక్కులు సొంతం చేసుకున్న మాటీవీ సంస్థ… ప్రస్తుతం కాస్త రేటు తగ్గించమని సంప్రదింపులు మొదలుపెట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే బన్నీ నటించిన సరైనోడు సినిమా శాటిలైట్ హక్కులు ఏకంగా 16కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయనేది తాజా వార్త. సన్ నెట్ వర్క్ సంస్థ… ఇంత మొత్తానికి ఈ సినిమా రైట్స్ తీసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా… మలయాళం, తమిళ్, హిందీ భాషలతో కలిసి శాటిలైట్ రైట్స్ ను గంపగుత్తగా కొనేసుకుంది సన్ టీవీ.
Click on Image to Read:
pawan-new-movie
puri
anushka
sardar
ramcharan
srinu-vaitla-varun-tej
First Published:  18 April 2016 3:55 AM GMT
Next Story