Telugu Global
Health & Life Style

ఇది డిజిట‌ల్ ప్ర‌జా ఉద్య‌మాల కాలం... సోష‌ల్ మీడియానే వేదిక‌!

సోష‌ల్‌మీడియా వ‌చ్చాక అన్యాయానికి గుర‌యిన‌వారికి అదొక మంచి వేదిక‌గా మారింది. చాలామంది తాము ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు, మోసాల‌ను ఇందులో వెల్ల‌డిస్తున్నారు.  తోటి నెటిజ‌న్ల నుండి నైతిక మ‌ద్ధ‌తుని పొందుతున్నారు. ఈ బాట‌లోనే ఆమ్ర‌పాలి నిర్మాణ సంస్థ మోసానికి గుర‌యిన ఏడుగురు వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలో తమ ఆవేద‌ని వెళ్ల‌బోసుకుంటున్నారు. ఆ సంస్థ‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న క్రికెటర్ ధోనీని ఆ సంస్థ‌నుండి బ‌య‌ట‌కు రావాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఆమ్ర‌పాలి సంస్థ నోయిడా ప్రాంతంలో  […]

ఇది డిజిట‌ల్ ప్ర‌జా ఉద్య‌మాల కాలం...  సోష‌ల్ మీడియానే వేదిక‌!
X

సోష‌ల్‌మీడియా వ‌చ్చాక అన్యాయానికి గుర‌యిన‌వారికి అదొక మంచి వేదిక‌గా మారింది. చాలామంది తాము ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు, మోసాల‌ను ఇందులో వెల్ల‌డిస్తున్నారు. తోటి నెటిజ‌న్ల నుండి నైతిక మ‌ద్ధ‌తుని పొందుతున్నారు. ఈ బాట‌లోనే ఆమ్ర‌పాలి నిర్మాణ సంస్థ మోసానికి గుర‌యిన ఏడుగురు వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలో తమ ఆవేద‌ని వెళ్ల‌బోసుకుంటున్నారు. ఆ సంస్థ‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న క్రికెటర్ ధోనీని ఆ సంస్థ‌నుండి బ‌య‌ట‌కు రావాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఆమ్ర‌పాలి సంస్థ నోయిడా ప్రాంతంలో ప‌ద‌కొండు ట‌వ‌ర్ల‌లో 1000 ఫ్లాట్ల నిర్మాణం మొదలుపెట్టింది. అయితే ఫ్లాట్ల నిర్మాణం పూర్త‌యినా ఇంత‌వ‌ర‌కు వాటిలో క‌నీస స‌దుపాయ‌లు కానీ, ర‌క్ష‌ణ విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు కానీ ఏమీ లేవు. ఫ్లాట్ల‌ను బుక్ చేసిన వారు అడిగి అడిగి విసుగెత్తి పోయి ఆశ‌ల‌ను వ‌దిలేసుకున్నారు. వారిలోని వారే ఈ ఏడుగురు వ్య‌క్తులు. ఇందులో ఒక మ‌హిళ ఉన్నారు. ఇందుకోసం వారు ట్విట్ట‌ర్ ఎకౌంట్‌ని, హ‌ల్లాబోల్ అనే వాట్సాప్ గ్రూపుని. ఒక ఫేస్‌బుక్ పేజిని కూడా ప్రారంభించారు.

సోష‌ల్ మీడియాతో ప‌రిచ‌యం లేనివారికి వీరు ట్యూష‌న్లు కూడా చెబుతున్నారు. ఇప్ప‌టికే వీరి సోష‌ల్ మీడియా ప్ర‌చారం అనూహ్య స్పంద‌న‌ని సాధించింది. ప్ర‌భుత్వంలో కూడా చ‌ల‌నం తెచ్చింది. ఒక‌ర‌కంగా దీన్ని డిజిట‌ల్ సాధికార‌త‌గా అభివ‌ర్ణిస్తున్నారు. వీరి డిజిటల్ ఉద్య‌మం, సెలబ్రిటీలు తాము ప్ర‌చారం చేస్తున్న ఉత్ప‌త్తుల మంచిచెడుల‌కు బాధ్య‌త వ‌హించాల‌నే వాద‌న‌ను బ‌య‌ట‌కు తెచ్చింది. ఇటీవ‌ల పార్ల‌మెంటు క‌మిటీ ఒక‌టి ఇలాంటి మార్పుల‌ను సూచిస్తూ ఒక నివేదిక ను త‌యారు చేసిన సంగ‌తి తెలిసిందే. ఫ్లాట్ల కొనుగోలులో ఇలాంటి క‌ష్టాలు ఎదుర్కొంటున్న‌వారంద‌రినీ త‌మ‌తో పాటు క‌లుపుకోవ‌డానికి వీరు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆమ్ర‌పాలిమిస్‌యూజ్‌ధోనీ అనే హ్యాష్‌ట్యాగ్‌కి 35ల‌క్ష‌ల స్పంద‌న‌లు వ‌చ్చాయంటే ఈ ప్ర‌చారం ఎంత ఉధృతంగా జ‌నంలోకి వెళ్లిందో తెలుసుకోవ‌చ్చు.

First Published:  17 April 2016 3:23 AM GMT
Next Story