Telugu Global
CRIME

అమ్మ‌మ్మ‌, తాత‌య్య‌, మ‌నుమ‌రాలు...ఓ దొంగల ముఠా!

బ‌స్సుల్లో, ఆల‌యాల్లో బంగారు న‌గ‌ల‌ను దోచుకుంటున్న ముగ్గురు స‌భ్యులున్న ఒక ముఠాని హైద‌రాబాద్, పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి ఇర‌వై తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ ముగ్గురూ స‌న్నిహిత బంధువులు కావ‌డం. డి మ‌ల్లేష్‌, డి నిర్మ‌ల‌తో పాటు వారి ప‌ద‌హారేళ్ల మ‌నుమ‌రాలు క‌లిసి దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు. గ‌త నెల మార్చిలో పోలీసులు దొంగ‌త‌నం కేసులో మ‌ల్లేష్‌, నిర్మ‌ల‌ల కూతురు మ‌మ‌త‌ని అరెస్టు చేశారు. మ‌మ‌తని బెయిల్‌మీద బ‌య‌ట‌కు […]

అమ్మ‌మ్మ‌, తాత‌య్య‌, మ‌నుమ‌రాలు...ఓ దొంగల ముఠా!
X

బ‌స్సుల్లో, ఆల‌యాల్లో బంగారు న‌గ‌ల‌ను దోచుకుంటున్న ముగ్గురు స‌భ్యులున్న ఒక ముఠాని హైద‌రాబాద్, పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి ఇర‌వై తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ ముగ్గురూ స‌న్నిహిత బంధువులు కావ‌డం. డి మ‌ల్లేష్‌, డి నిర్మ‌ల‌తో పాటు వారి ప‌ద‌హారేళ్ల మ‌నుమ‌రాలు క‌లిసి దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు.

గ‌త నెల మార్చిలో పోలీసులు దొంగ‌త‌నం కేసులో మ‌ల్లేష్‌, నిర్మ‌ల‌ల కూతురు మ‌మ‌త‌ని అరెస్టు చేశారు. మ‌మ‌తని బెయిల్‌మీద బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి పూచీక‌త్తుగా డ‌బ్బుని క‌ట్టాల్సి ఉంది. దాంతో మ‌ల్లేష్‌, నిర్మ‌ల వారి మ‌నుమ‌రాలు మ‌రింత ఎక్కువ‌గా దొంగ‌త‌నాలు మొద‌లుపెట్టారు. మ‌మ‌త, ఆమె త‌ల్లిదండ్రుల‌పై మొత్తం 21 కేసులు ఉన్నాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. మ‌నుమ‌రాలిమీద గ‌త ఏడునెల‌ల కాలంలో ఆరు కేసులు ఉన్నాయి. ఈ కుటుంబం బ‌ల్కంపేట ఎల్ల‌మ్మగుడిని, డిపి కాల‌నీలోని సాయిబాబా గుడిని టార్గెట్ చేసి భ‌క్తుల నుండి బంగారు న‌గ‌ల‌ను కాజేస్తోంది. అలాగే నిమ్స్ ఆసుప‌త్రిలోనూ, ఆర్‌టిసి బ‌స్‌ల్లోనూ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు. ఎవ‌రినుండైతే దొంగ‌త‌నం చేయాల‌నుకుంటారో వారిని మ‌భ్య‌పెట్టి, మాటల్లో పెట్టి మాయ‌జేయ‌డం వీరికి వెన్నతో పెట్టిన విద్య‌.

Next Story