Telugu Global
Cinema & Entertainment

 కబాలిపై స్పష్టత ఇచ్చిన సూపర్ స్టార్

కబాలి సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా నుంచి రోబో 2.0కు ఎప్పుడో షిఫ్ట్ అయ్యాడు రజనీకాంత్. నిజానికి తమిళ కొత్త సంవత్సరం రోజున కబాలి టీజర్ ను విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ తమిళ కొత్త సంవత్సరం అయిపోయి… వారం రోజులు గడుస్తున్నా టీజర్ జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో కబాలి సినిమా విడుదల తేదీపై అనుమానాలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో స్వయంగా రజనీకాంత్ […]

 కబాలిపై స్పష్టత ఇచ్చిన సూపర్ స్టార్
X
కబాలి సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా నుంచి రోబో 2.0కు ఎప్పుడో షిఫ్ట్ అయ్యాడు రజనీకాంత్. నిజానికి తమిళ కొత్త సంవత్సరం రోజున కబాలి టీజర్ ను విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ తమిళ కొత్త సంవత్సరం అయిపోయి… వారం రోజులు గడుస్తున్నా టీజర్ జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో కబాలి సినిమా విడుదల తేదీపై అనుమానాలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో స్వయంగా రజనీకాంత్ రంగంలోకి దిగి… సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు. పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకోవడానికి ఢిల్లీ వచ్చిన రజనీకాంత్… ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తమిళ నూతన సంవత్సర కానుగా కబాలి టీజర్ ను విడుదల చేయలేకపోయామని బాధపడిన రజనీకాంత్… సినిమా విడుదలపై మాత్రం క్లారిటీ ఇచ్చారు. సరిగ్గా డేట్ ఫిక్స్ చేయకపోయినప్పటికీ…. మే చివరి వారం లేదా జూన్ తొలి వారంలో కబాలి సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు. ఈ గ్యాప్ లో మే మొదటి రెండో వారంలో కబాలి సినిమాకు సంబంధించి తెలుగు-తమిళ ఆడియో వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తామని రజనీకాంత్ స్పష్టంచేశాడు. ఇలా స్వయంగా సూపర్ స్టారే క్లారిటీ ఇవ్వడంతో ప్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి సినిమాలో రజనీకాంత్ డాన్ గా కనిపించబోతున్నారు.
First Published:  15 April 2016 1:11 AM GMT
Next Story