Telugu Global
International

ఎంత తాగితే...అన్ని మార్కులు!

విద్యార్థుల తెలివితేట‌లు, చ‌దువులో సామ‌ర్ధ్యాన్ని బ‌ట్టి టీచ‌ర్లు మార్కులు ఇవ్వ‌డం మామూలే. కానీ చైనా రాజ‌ధాని బీజింగ్‌లో మాత్రం ఒక టీచ‌రు ఈ విష‌యంలో అంద‌రికీ భిన్నంగా వెళ్లాల‌నుకున్నాడు. ఎంత ఆల్క‌హాల్ తాగితే అన్ని మార్కులు ఇస్తానంటూ విద్యార్థుల‌కు స‌రికొత్త ప‌రీక్ష పెట్టాడు. గు మింగ్ అనే ఈ టీచ‌రు, చైనా సంప్ర‌దాయ మెడిసిన్ త‌యారీ స‌బ్జ‌క్టుని  ఒక ఒకేష‌న్ ఇన్‌స్టిట్యూట్‌లో బోధిస్తుంటాడు. ఆయ‌న విద్యార్థులకు ఈ వింత ప‌రీక్ష పెట్టాడు. ఒక‌గ్లాసు ఆల్క‌హాల్ ని పూర్తిగా […]

ఎంత తాగితే...అన్ని మార్కులు!
X

విద్యార్థుల తెలివితేట‌లు, చ‌దువులో సామ‌ర్ధ్యాన్ని బ‌ట్టి టీచ‌ర్లు మార్కులు ఇవ్వ‌డం మామూలే. కానీ చైనా రాజ‌ధాని బీజింగ్‌లో మాత్రం ఒక టీచ‌రు ఈ విష‌యంలో అంద‌రికీ భిన్నంగా వెళ్లాల‌నుకున్నాడు. ఎంత ఆల్క‌హాల్ తాగితే అన్ని మార్కులు ఇస్తానంటూ విద్యార్థుల‌కు స‌రికొత్త ప‌రీక్ష పెట్టాడు. గు మింగ్ అనే ఈ టీచ‌రు, చైనా సంప్ర‌దాయ మెడిసిన్ త‌యారీ స‌బ్జ‌క్టుని ఒక ఒకేష‌న్ ఇన్‌స్టిట్యూట్‌లో బోధిస్తుంటాడు. ఆయ‌న విద్యార్థులకు ఈ వింత ప‌రీక్ష పెట్టాడు. ఒక‌గ్లాసు ఆల్క‌హాల్ ని పూర్తిగా తాగితే వంద మార్కులు, స‌గం గ్లాసు తాగితే తొంభై మార్కులు, ఒక్క‌సారి మాత్ర‌మే సిప్ చేస్తే 60 మార్కులు, అస‌లు తాగ‌ని వారిని ఫెయిల్ చేస్తాన‌ని చెప్పాడు. ఈ మొత్తం విష‌యాన్ని ఒక విద్యార్థి వైబో అనే చైనీస్ మైక్రో బ్లాగ్‌లో పోస్ట్ చేశాడు. దాంతో మాస్టారు గారి అతి తెలివి బ‌య‌ట‌కు వ‌చ్చింది. సంస్థ యాజ‌మాన్యం ఆయ‌నని ఉద్యోగం నుండి తొల‌గించింది. గు మింగ్ పెట్టిన ప‌రీక్ష వ‌ల‌న చాలామంది విద్యార్థులు అనారోగ్యానికి గుర‌య్యారు. గు మింగ్ దీన్ని జోక్‌గా భావించి ఉంటాడ‌ని ఆయ‌న ప‌నిచేస్తున్న డిప్యుటీ డైర‌క్ట‌ర్ వ్యాఖ్యానించారు.

First Published:  15 April 2016 1:05 AM GMT
Next Story