Telugu Global
Cinema & Entertainment

అ...ఆ టీజర్ రివ్యూ

ఉగాదికే విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఎందుకో టెక్నికల్ రీజన్స్ వల్ల కుదరలేదు. మొత్తానికి కాస్త లేటయినా ఫ్రెష్ గా విడుదలైంది అ..ఆ టీజర్. మొన్నటివరకు ఈ టైటిల్ చూస్తే ఇదేదో సెన్సిబుల్ స్టోరీ అని అంతా అనుకున్నారు. టీజర్ చూసిన తర్వాత అంతా దానికే ఫిక్స్ అయిపోయారు. సునిశితమైన ప్రేమకథగా అ..ఆ సినిమా తెరకెక్కిందనే విషయాన్ని టీజర్ తో స్పష్టంగా చెప్పాడు త్రివిక్రమ్. ఈ టీజర్ ఎంత హోమ్లీగా, సింపుల్ గా ఉందంటే… సినిమాలో కనీసం ఒక్కటంటే […]

అ...ఆ టీజర్ రివ్యూ
X
ఉగాదికే విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఎందుకో టెక్నికల్ రీజన్స్ వల్ల కుదరలేదు. మొత్తానికి కాస్త లేటయినా ఫ్రెష్ గా విడుదలైంది అ..ఆ టీజర్. మొన్నటివరకు ఈ టైటిల్ చూస్తే ఇదేదో సెన్సిబుల్ స్టోరీ అని అంతా అనుకున్నారు. టీజర్ చూసిన తర్వాత అంతా దానికే ఫిక్స్ అయిపోయారు. సునిశితమైన ప్రేమకథగా అ..ఆ సినిమా తెరకెక్కిందనే విషయాన్ని టీజర్ తో స్పష్టంగా చెప్పాడు త్రివిక్రమ్. ఈ టీజర్ ఎంత హోమ్లీగా, సింపుల్ గా ఉందంటే… సినిమాలో కనీసం ఒక్కటంటే ఒక్క ఫైట్ కూడా ఉండదేమో అనిపించేంతలా ఉంది. మూవీలో మాస్ డైలాగ్ మచ్చుకైనా కనిపించదేమో అనిపించేలా సినిమా టీజర్ ఉంది. మొత్తమ్మీద నితిన్ ను కొత్తగా చూపించడంతో పాటు… త్రివిక్రమ్ స్టయిల్ ను మరోసారి ఆవిష్కరించినట్టు టీజర్ రిలీజైంది. పక్కపక్కనే ఉన్న అక్షరాలు కలుసుకోవడానికి పాతికేళ్లు పట్టింది అనే డైలాగ్ తో టీజర్ ను ముగించి… త్రివిక్రమ్ తన మార్క్ చాటుకున్నాడు. ఇక మిక్కీ జే మేయర్ అయితే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు. ఓవరాల్ గా సినిమాపై అంచనాలు పెంచే విధంగానే టీజర్ తెరకెక్కింది. నితిన్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన అ..ఆ సినిమా మే 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
https://youtu.be/aFNx2ydeowA
First Published:  13 April 2016 10:46 PM GMT
Next Story