Telugu Global
CRIME

కారులో హ‌త్య‌!

ఇద్ద‌రు యువ‌కుల మ‌ధ్య మొద‌లైన చిన్న గొడ‌వ చిలికి చిలికి గాలివానై వారిలో ఒక‌రి ప్రాణాలు తీసింది. న‌డుస్తున్న కారులోనే దుండ‌గులు ఓ యువ‌కుని ప్రాణాలు తీశారు. బెంగ‌లూరులోని సుబ్ర‌మ‌ణ్య‌పురా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. మదేష్ (23) అనే యువ‌కుడు, అత‌ని సోద‌రుడు ఇద్ద‌రు క‌లిసి శ‌నివారం త‌మ‌ ఇంటికి సమీపంలో ఎవరూ లేని ప్ర‌దేశంలో మ‌ద్యం తాగటం మొద‌లుపెట్టారు. అటుగా వెళుతున్న శివ‌కుమార్ అనే వ్య‌క్తి ప‌బ్లిక్ స్థ‌లాల్లో మద్యం తాగ‌కూడ‌ద‌ని […]

ఇద్ద‌రు యువ‌కుల మ‌ధ్య మొద‌లైన చిన్న గొడ‌వ చిలికి చిలికి గాలివానై వారిలో ఒక‌రి ప్రాణాలు తీసింది. న‌డుస్తున్న కారులోనే దుండ‌గులు ఓ యువ‌కుని ప్రాణాలు తీశారు. బెంగ‌లూరులోని సుబ్ర‌మ‌ణ్య‌పురా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. మదేష్ (23) అనే యువ‌కుడు, అత‌ని సోద‌రుడు ఇద్ద‌రు క‌లిసి శ‌నివారం త‌మ‌ ఇంటికి సమీపంలో ఎవరూ లేని ప్ర‌దేశంలో మ‌ద్యం తాగటం మొద‌లుపెట్టారు. అటుగా వెళుతున్న శివ‌కుమార్ అనే వ్య‌క్తి ప‌బ్లిక్ స్థ‌లాల్లో మద్యం తాగ‌కూడ‌ద‌ని వారించాడు. దాంతో గొడ‌వ జ‌రిగింది. వివాదం పెరిగిపోయి మ‌దేష్, శివ‌కుమార్ త‌ల‌మీద కొట్టాడు. ఆగ్ర‌హానికి గురైన శివ‌కుమార్ త‌న స్నేహితుల‌తో క‌లిసివ‌చ్చి మ‌దేష్ మీద దాడిచేశాడు. అత‌డిని బ‌ల‌వంతంగా కారులోకి ఎక్కించి స‌ర‌క్కి గేట్ అనే ప్రాంతానికి తీసుకువెళ్లారు. కారులోనే క‌త్తితో ప‌లుమార్లు పొడిచి చంపారు. మ‌దేష్ శ‌రీరాన్ని ఓ బ‌స్టాఫ్‌కి చేరువ‌లో ప‌డేసి వెళ్లిపోయారు. ఆదివారం మ‌ధ్యాహ్నానికి ఈ హ‌త్యా ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. మ‌దేష్ సోద‌రుని ఫిర్యాదు మేర‌కు పోలీసులు శివ‌కుమార్‌ని అరెస్టు చేశారు. పోలీసుల ఇంటరాగేష‌న్‌లో హ‌త్య చేసిన‌ట్టుగా అంగీక‌రించిన శివకుమార్‌, త‌న‌కు స‌హ‌క‌రించిన ఆరుగురు స్నేహితుల వివ‌రాలు చెప్పాడు. పోలీసులు నిందితులంద‌రినీ అరెస్టు చేశారు.

Next Story