Telugu Global
Cinema & Entertainment

అఖిల్ తో సినిమా చేయను

అఖిల్ తో సినిమా చేసేందుకు ఏ హీరోయిన్ అయినా సిద్ధంగా ఉంటుంది. కానీ నాగబాబు కూతురు నిహారిక మాత్రం అఖిల్ తో సినిమా చేయనంటోంది. అవును… అఖిల్ చేయబోతున్న రెండో సినిమాలో నాగబాబు తనయ నిహారిక హీరోయిన్ అంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిహారిక ఖండించింది. అఖిల్ తో తను సినిమా చేయడం లేదని ప్రకటించింది. అంతేకాదు… తన డ్రెస్సింగ్ స్టయిల్ కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చింది. చిట్టిపొట్టి నిక్కర్లు, గౌన్లు లాంటివి […]

అఖిల్ తో సినిమా చేయను
X
అఖిల్ తో సినిమా చేసేందుకు ఏ హీరోయిన్ అయినా సిద్ధంగా ఉంటుంది. కానీ నాగబాబు కూతురు నిహారిక మాత్రం అఖిల్ తో సినిమా చేయనంటోంది. అవును… అఖిల్ చేయబోతున్న రెండో సినిమాలో నాగబాబు తనయ నిహారిక హీరోయిన్ అంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిహారిక ఖండించింది. అఖిల్ తో తను సినిమా చేయడం లేదని ప్రకటించింది. అంతేకాదు… తన డ్రెస్సింగ్ స్టయిల్ కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చింది. చిట్టిపొట్టి నిక్కర్లు, గౌన్లు లాంటివి వేసుకోనని, మ్యాగ్జిమమ్ ట్రెడిషనల్ గా కనిపించడానికే ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించింది. మెగా కాంపౌండ్ కు మచ్చతెచ్చేలా ప్రవర్తించనని ఇండైరెక్ట్ గా సెలవిచ్చింది. అన్నట్టు ఆమె నటించిన తొలి సినిమా ఒక మనసు విడుదలకు సిద్ధమైంది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండుమూడు స్టిల్స్ విడుదలయ్యాయి. తాజా స్టిల్ లో నిహారిక నుదిటిన నాగశౌర్య ముద్దుపెట్టే ఫొటోను విడుదల చేశారు. సినిమా ఆడియోను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.
First Published:  10 April 2016 12:31 AM GMT
Next Story