Telugu Global
NEWS

నారాయణకు వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ

తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యారంగంలో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. నిబంధనలన్నీ గాల్లోకి వదిలేసి వందలాది మంది విద్యార్థులను భవంతులలో కుక్కి విద్య నేర్పే చెడు పద్దతి కార్పొరేట్ విద్యాసంస్థలలో పేట్రేగిపోయింది. ముఖ్యంగా నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజీల రంగ ప్రవేశం తర్వాత విద్యార్థులు మనుషుల్లా కాకుండా మరయంత్రాల్లా బతకాల్సిన పరిస్థితి దాపురించింది. ఎంతో మంది విద్యార్థులు వీరి ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ, చైతన్య కాలేజీలకు వ్యతిరేకంగా కరపత్రాల […]

నారాయణకు వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ
X

తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యారంగంలో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. నిబంధనలన్నీ గాల్లోకి వదిలేసి వందలాది మంది విద్యార్థులను భవంతులలో కుక్కి విద్య నేర్పే చెడు పద్దతి కార్పొరేట్ విద్యాసంస్థలలో పేట్రేగిపోయింది. ముఖ్యంగా నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజీల రంగ ప్రవేశం తర్వాత విద్యార్థులు మనుషుల్లా కాకుండా మరయంత్రాల్లా బతకాల్సిన పరిస్థితి దాపురించింది. ఎంతో మంది విద్యార్థులు వీరి ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో నారాయణ, చైతన్య కాలేజీలకు వ్యతిరేకంగా కరపత్రాల ఉద్యమం ప్రారంభమైంది. విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను చైతన్యపరిచేందుకు కరపత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ కార్యక్రమం మొదలైంది. ”చదువులా… చావులా… నారాయణ, చైతన్య కాలేజీల్లో మన పిల్లలను చేర్పించి చంపుకుందామా!. ఒక సారి ఆలోచించండి” అంటూ ముద్రించిన కరపత్రాలను పట్టణవ్యాప్తంగా పంచారు.

ఇప్పటి వరకు నారాయణ కాలేజీల్లో జరిగిన దారుణాలను కరపత్రాల్లో ముద్రించారు. రాష్ట్రంలో నారాయణ, చైతన్య కాలేజీలో మినహా మరెక్కడా ఆత్మహత్యలు జరగడం లేదని వారు వివరించారు. 2005 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు కాలేజీల్లో 1000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు వివరించారు. గడిచిన 11 నెలల్లో 14 మంది విద్యార్థులు నారాయణ కాలేజీల్లో ఆత్మహత్య చేసుకున్నారని… కానీ విద్యాసంస్థల అధినేత మంత్రి నారాయణపై చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. తమ పిల్లలు ప్రాణాలతో ఉండాలనుకునే తల్లిదండ్రులు ఎవరైనా సరే నారాయణ, చైతన్య కాలేజ్‌లో చేర్పించవద్దని సూచించారు.

Click on Image to Read:

devansh

lokesh11

sardar-gabbar-singh

pawan-sardar-gabbar-singh

pawan-sardar-gabbar

venu

cbn-chaganti

pawan12345

sardaar-gabbar-singh-movie-

First Published:  9 April 2016 10:10 PM GMT
Next Story