Telugu Global
Cinema & Entertainment

జెంటిల్ మేన్ గా మారిపోయిన నాని

అప్పుడెప్పుడో శంకర్ దర్శకత్వంలో వచ్చింది జెంటిల్మేన్ సినిమా. మళ్లీ ఆ టైటిల్ ను ఎవరూ ముట్టుకోలేదు. ఇన్నాళ్లకు నాని ఆ పేరుపై మనసు పడ్డాడు. తన కొత్త సినిమాకు జెంటిల్మేన్ అనే టైటిల్ పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. సురభి, నివేదా థామస్ హీరయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మణిశర్మ  ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి […]

జెంటిల్ మేన్ గా మారిపోయిన నాని
X
అప్పుడెప్పుడో శంకర్ దర్శకత్వంలో వచ్చింది జెంటిల్మేన్ సినిమా. మళ్లీ ఆ టైటిల్ ను ఎవరూ ముట్టుకోలేదు. ఇన్నాళ్లకు నాని ఆ పేరుపై మనసు పడ్డాడు. తన కొత్త సినిమాకు జెంటిల్మేన్ అనే టైటిల్ పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. సురభి, నివేదా థామస్ హీరయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి మొన్నటివరకు మూడు టైటిల్స్ చక్కర్లు కొట్టాయి. జెంటిల్మేన్ పేరుతో పాటు ఎవడితడు, ధమాకా అనే టైటిల్స్ అనుకున్నారు. వీటిలో థమాకా అనే టైటిల్ ను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేశారు. అయితే చివరి నిమిషంలో అంతా జెంటిల్మేన్ టైటిల్ కే ఓటేశారు. కథ ప్రకారం ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని అంతా ఫీలయ్యారు. అలా జెంటిల్మేన్ గా మారిపోయాడు నాని.
First Published:  10 April 2016 12:31 AM GMT
Next Story