Telugu Global
Cinema & Entertainment

మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం... మీరు అక్కడకి రారు... ఇక్కడే ఉంటారు...

మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం… మీరు అక్కడకి రారు… ఇక్కడే ఉంటారు… అనేది కామెడీ పరంగా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది. ఇప్పుడీ డైలాగ్ పవన్ కల్యాణ్ కు కూడా సరిగ్గా సరిపోతుంది. పవన్ ను ఎక్కడికో తీసుకెళ్లాలని ఫ్యాన్స్ ఆరాటపడ్డారు. కానీ పవన్ మాత్రం ఆ స్థానానికి వెళ్లడు. ఇక్కడే ఉండిపోతాడు. అవసరమైతే మరో పదేళ్లు వెనక్కివెళ్లిపోతాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చూసినవాళ్లంతా ఇలానే ఫీలవుతున్నారు. పవన్ కు  ఉన్న ఫ్యాన్ సపోర్టింగ్ కు… ఏమాత్రం […]

మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం... మీరు అక్కడకి రారు... ఇక్కడే ఉంటారు...
X
మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం… మీరు అక్కడకి రారు… ఇక్కడే ఉంటారు… అనేది కామెడీ పరంగా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది. ఇప్పుడీ డైలాగ్ పవన్ కల్యాణ్ కు కూడా సరిగ్గా సరిపోతుంది. పవన్ ను ఎక్కడికో తీసుకెళ్లాలని ఫ్యాన్స్ ఆరాటపడ్డారు. కానీ పవన్ మాత్రం ఆ స్థానానికి వెళ్లడు. ఇక్కడే ఉండిపోతాడు. అవసరమైతే మరో పదేళ్లు వెనక్కివెళ్లిపోతాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చూసినవాళ్లంతా ఇలానే ఫీలవుతున్నారు. పవన్ కు ఉన్న ఫ్యాన్ సపోర్టింగ్ కు… ఏమాత్రం దృష్టిపెట్టి సినిమాను సోసోగా తీసినా… దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిపోతారు అభిమానులు. కానీ పవన్ మాత్రం ఆ పని చేయడు. తను జానీ, గుడుంబా శంకర్ కాలంలోనే ఇంకా ఉండిపోయాడనేది ఫ్యాన్స్ బాధ.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి పైకి చెప్పకపోయినా… అన్ని తానై నడిపించాడు పవన్. ఆ విషయం ప్రేక్షకులకు కూడా తెలుసు. సినిమాకు దర్శకుడు పవనే అనే ఫీలింగ్ అందరికీ ఉంది. దీంతో సర్దార్ సినిమాతో పవన్ టేస్ట్ ఏంటో ఫ్యాన్స్ కు అర్థమైపోయింది. తమకు నచ్చేలా సినిమా తీయలేదని పవన్ ను తిట్టుకోవాలో… లేక పవన్ రేంజ్ కు తాము దిగలేదని తమను తాము నిందించుకోవాలో ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.

Click on Image to Read:

pawan-babu1

sardar-gabbar-singh

kajal-pawan

konda-family

warangal-municipal-election

jammalamadugu-1

bhuma

pawan-sardar-gabbar

sardaar-gabbar-singh-movie-

First Published:  8 April 2016 10:08 PM GMT
Next Story