Telugu Global
Cinema & Entertainment

అధికారికంగా బాలయ్య వందో చిత్రం

తన సెంచరీ మూవీగా బాలయ్య, క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తాడనే విషయం అందరికీ తెలుసు. అమరావతిని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవితగాథ ఆధారంగా చారిత్రక నేపథ్యంలో సినిమా చేస్తాడనే విషయం కూడా తెలుసు. అయితే ఆ విషయాలన్నింటినీ తాజాగా బాలయ్య అధికారికంగా ప్రకటించారు. ఓ మంచి ముహూర్తం చూసి తన వందో సినిమా విశేషాల్ని వెల్లడిస్తానని ప్రకటించిన బాలకృష్ణ… చెప్పినట్టుగానే ఉగాది పర్వదినాన, అమరావతిలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో తన చిత్రానికి సంబంధించిన సంగతుల్ని వెల్లడించాడు. అయితే […]

అధికారికంగా బాలయ్య వందో చిత్రం
X
తన సెంచరీ మూవీగా బాలయ్య, క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తాడనే విషయం అందరికీ తెలుసు. అమరావతిని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవితగాథ ఆధారంగా చారిత్రక నేపథ్యంలో సినిమా చేస్తాడనే విషయం కూడా తెలుసు. అయితే ఆ విషయాలన్నింటినీ తాజాగా బాలయ్య అధికారికంగా ప్రకటించారు. ఓ మంచి ముహూర్తం చూసి తన వందో సినిమా విశేషాల్ని వెల్లడిస్తానని ప్రకటించిన బాలకృష్ణ… చెప్పినట్టుగానే ఉగాది పర్వదినాన, అమరావతిలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో తన చిత్రానికి సంబంధించిన సంగతుల్ని వెల్లడించాడు. అయితే అందరికీ తెలిసిన సంగతుల్నే బాలయ్య మళ్లీ మళ్లీ వినిపించారు తప్ప…. ఈ సినిమా ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కనీసం హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటున్నారో చెప్పలేదు. అంతెందుకు… సినిమాకు కోసం తను ఎలా ప్రిపేర్ అవుతున్నాననే విషయాన్ని కూడా వెల్లడించలేదు. ఇలాంటి విషయాలు చెబితే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి. మరీ ముఖ్యంగా గుర్రపుస్వారీ ప్రాక్టీస్ చేస్తున్న బాలయ్య, ఆ విషయాన్ని చెబితే ఫ్యాన్స్ మరింత ఆనందించేవాళ్లు. మొత్తానికి బాలయ్య వందో సినిమాపై అధికారికంగా ప్రకటన రావడంతో మిగతా రూమర్లకు చెక్ పడింది.
First Published:  8 April 2016 10:03 PM GMT
Next Story