Telugu Global
Cinema & Entertainment

షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన ఐశ్వర్యరాయ్

ప్రస్తుతం సరబ్ జిత్ అనే సినిమా చేస్తోంది అందాల తార ఐశ్వర్యరాయ్. రీఎంట్రీలో పెద్దగా ఆకట్టుకోని ఈ భామ… తాజా చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉంది. అందుకే కష్టమైన లొకేషన్లలో అయినప్పటికీ ఇష్టంగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడింది ఐష్. ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ ఇరుకైన వీధిలో ఆవేశంగా పరుగెత్తే సన్నివేశంలో ఐశ్వర్యరాయ్ కాలుజారింది. మోకాలికి తీవ్ర గాయమైంది. చెప్పులు కూడా విరిగిపోయాయి. ఇక […]

షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన ఐశ్వర్యరాయ్
X
ప్రస్తుతం సరబ్ జిత్ అనే సినిమా చేస్తోంది అందాల తార ఐశ్వర్యరాయ్. రీఎంట్రీలో పెద్దగా ఆకట్టుకోని ఈ భామ… తాజా చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉంది. అందుకే కష్టమైన లొకేషన్లలో అయినప్పటికీ ఇష్టంగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడింది ఐష్. ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ ఇరుకైన వీధిలో ఆవేశంగా పరుగెత్తే సన్నివేశంలో ఐశ్వర్యరాయ్ కాలుజారింది. మోకాలికి తీవ్ర గాయమైంది. చెప్పులు కూడా విరిగిపోయాయి. ఇక షూటింగ్ క్యాన్సిల్ అనుకుంటున్న టైమ్ లో… ఐష్ రీటేక్ చెప్పింది. చెప్పులు లేకపోయినా… షూటింగ్ లో పాల్గొంది. ఆ సీన్ కంప్లీట్ అయిన తర్వాతే హాస్పిటల్ కే వెళ్లింది. ప్రస్తుతం డాక్టర్లు ఆమెకు ప్రమాదమేం లేదని నిర్థారించారు. అయితే 5 రోజుల పాటు కాలు కదపవద్దని సూచించారు.

Click on Image to Read:

pawan-sardar-gabbar

sardaar-gabbar-singh-movie-

First Published:  8 April 2016 10:05 PM GMT
Next Story