Telugu Global
CRIME

కొడుకుని కిరాత‌కంగా చంపిన తండ్రి!

చ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. త‌న దుర‌దృష్టానికి కొడుకే కార‌ణ‌మ‌నే మూఢ‌న‌మ్మ‌కంతో ఓ తండ్రి క‌న్న‌కొడుకుని దారుణంగా హ‌త‌మార్చాడు. రాయ్‌పూర్‌కి స‌మీపంలో ఉన్న తిల్డా అనే గ్రామానికి చెందిన శ్ర‌వ‌ణ్ స‌త్నామీ (38)కి కులేశ్వ‌ర్ అనే తొమ్మిదేళ్ల కొడుకున్నాడు. పేద‌రికం ఇబ్బందులతో బాధ‌ప‌డుతున్న శ్ర‌వ‌ణ్ అందుకు కార‌ణం త‌న కొడుకేన‌ని న‌మ్మాడు. కొడుకు కార‌ణంగా త‌న‌కు క‌లిసి రావ‌డం లేద‌ని, అత‌ని వ‌ల్ల‌నే త‌న‌ని దుర‌దృష్టం వెంటాడుతోంద‌ని భావించి ఆ ఆవేశంతో విచ‌క్ష‌ణ మ‌ర‌చి పోయి క‌న్న‌కొడుకుని […]

కొడుకుని కిరాత‌కంగా చంపిన తండ్రి!
X

చ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. త‌న దుర‌దృష్టానికి కొడుకే కార‌ణ‌మ‌నే మూఢ‌న‌మ్మ‌కంతో ఓ తండ్రి క‌న్న‌కొడుకుని దారుణంగా హ‌త‌మార్చాడు. రాయ్‌పూర్‌కి స‌మీపంలో ఉన్న తిల్డా అనే గ్రామానికి చెందిన శ్ర‌వ‌ణ్ స‌త్నామీ (38)కి కులేశ్వ‌ర్ అనే తొమ్మిదేళ్ల కొడుకున్నాడు. పేద‌రికం ఇబ్బందులతో బాధ‌ప‌డుతున్న శ్ర‌వ‌ణ్ అందుకు కార‌ణం త‌న కొడుకేన‌ని న‌మ్మాడు. కొడుకు కార‌ణంగా త‌న‌కు క‌లిసి రావ‌డం లేద‌ని, అత‌ని వ‌ల్ల‌నే త‌న‌ని దుర‌దృష్టం వెంటాడుతోంద‌ని భావించి ఆ ఆవేశంతో విచ‌క్ష‌ణ మ‌ర‌చి పోయి క‌న్న‌కొడుకుని అత్యంత కిరాత‌కంగా చంపేశాడు. ఉద‌యాన్నే నిద్ర‌పోతున్న కులేశ్వ‌ర్‌ని లేపి, అతని త‌ల‌ని ప‌దేప‌దే నేల‌కేసి బాదాడు. స్పృహ కోల్పోయిన కులేశ్వ‌ర్‌ని గొంతునులిమి హత్య‌చేశాడు. ఆ స‌మ‌యంలో అత‌ని భార్య ఇంట్లో లేదు. ఆమె ఇంటికి వ‌చ్చేస‌రికి కొడుకు ర‌క్త‌పు మ‌డుగులో క‌నిపించాడు. దాంతో ఆమె కేక‌లు వేయ‌గా చుట్టుప‌క్క‌ల వారు పోగ‌య్యారు. శ్ర‌వ‌ణ్‌ని పోలీసుల‌కు అప్ప‌గించారు. అత‌ను త‌న కొడుకుని హ‌త్య‌చేసిన‌ట్టుగా అంగీక‌రించాడు.

Next Story