Telugu Global
NEWS

106 కోట్లు"ఇది చాలా చిన్న విషయం"

మారిషస్‌ బ్యాంక్‌లో 106 కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన కేసులో తనకు కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీచేయడంపై కేంద్ర టీడీపీ మంత్రి సుజనా చౌదరి స్పందించారు. ఇది చాలా చిన్న విషయమని దీనికి ఇంత రాదాంతం ఎందుకని ఆయన ఎదరు ప్రశ్నించారు. అదే సమయంలో ఆ రుణానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రుణం తీసుకున్న సంస్థకు తన కంపెనీ హామీ దారుగా మాత్రమే ఉందన్నారు. సుజనా సంస్థలకు తాను వ్యవస్థాపకుడిని మాత్రమేనని, 2010 వరకు దానికి […]

106 కోట్లుఇది చాలా చిన్న విషయం
X

మారిషస్‌ బ్యాంక్‌లో 106 కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన కేసులో తనకు కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీచేయడంపై కేంద్ర టీడీపీ మంత్రి సుజనా చౌదరి స్పందించారు. ఇది చాలా చిన్న విషయమని దీనికి ఇంత రాదాంతం ఎందుకని ఆయన ఎదరు ప్రశ్నించారు. అదే సమయంలో ఆ రుణానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రుణం తీసుకున్న సంస్థకు తన కంపెనీ హామీ దారుగా మాత్రమే ఉందన్నారు.

సుజనా సంస్థలకు తాను వ్యవస్థాపకుడిని మాత్రమేనని, 2010 వరకు దానికి చైర్మన్‌గా ఉన్నానని చెప్పారు. 2010 నుంచి 2014 వరకు అందులో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నాని అన్నారు. ప్రస్తుతం తనకు ఆ కంపెనీలో 1 శాతం కంటే తక్కువ షేర్ మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. వాళ్లు డబ్బు తీసుకున్న మాట వాస్తవమేనని, వ్యాపారంలో నష్టం వచ్చింది కాబట్టి కట్టలేకపోతున్నారని తెలిపారు. కోర్టుకు హాజరు అయ్యే విషయంలో న్యాయవాది సలహామేరకు నడుచుకుంటానని చెప్పారు. ఈ వ్యవహారం చాలా చిన్నదని అనవసర రాదాంతం సరికాదని, మీడియాకి క్లారిటీ ఇవ్వడంకోసమే ప్రెస్‌మీట్‌ పెట్టానని చెప్పారు. మొత్తం మీద 106 కోట్ల రుణ వ్యవహారం చాలా చిన్న విషయం అన్న భావన కలిగేలా చేసేందుకు సుజనా ప్రయత్నించారు.

Click on Image to Read:

Yarlagadda-Lakshmi-Prasad

cbn-devansh

kamineni

cpi-narayana

lokesh-brahmani

ysrcp-mla-yellow-media

chintu

jc-prabhakar-reddy1

jagan-mohan-babu

jc1

lokesh

First Published:  8 April 2016 3:30 AM GMT
Next Story