Telugu Global
Cinema & Entertainment

ఘనంగా సోగ్గాడి వంద రోజుల వేడుక

ఈ సంక్రాంతికొచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సోగ్గాడే చిన్ని నాయనా సినిమా. ఈ సినిమాను కొనుక్కున్న వ్రతి ఒక్కరికి మినిమం 200శాతం లాభాలొచ్చాయి. ప్రతి ఒక్కరూ లాభపడ్డారు. సంక్రాంతి పోటీ కనుక లేకుండా ఉండుంటే… ఈ సినిమాకు కచ్చితంగా 50కోట్ల రూపాయల వసూళ్లు వచ్చి ఉండేవి. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత జన్యూన్ హిట్ అనిపించుకున్న సోగ్గాడే చిన్ని నాయనా విజయాన్ని మరోసారి సెలబ్రేట్ చేసుకోవాలని టీం నిర్ణయించింది. ఈనెల 13న హైదరాబాద్ శిల్పకళావేదికలో సోగ్గాడే […]

ఘనంగా సోగ్గాడి వంద రోజుల వేడుక
X
ఈ సంక్రాంతికొచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సోగ్గాడే చిన్ని నాయనా సినిమా. ఈ సినిమాను కొనుక్కున్న వ్రతి ఒక్కరికి మినిమం 200శాతం లాభాలొచ్చాయి. ప్రతి ఒక్కరూ లాభపడ్డారు. సంక్రాంతి పోటీ కనుక లేకుండా ఉండుంటే… ఈ సినిమాకు కచ్చితంగా 50కోట్ల రూపాయల వసూళ్లు వచ్చి ఉండేవి. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత జన్యూన్ హిట్ అనిపించుకున్న సోగ్గాడే చిన్ని నాయనా విజయాన్ని మరోసారి సెలబ్రేట్ చేసుకోవాలని టీం నిర్ణయించింది. ఈనెల 13న హైదరాబాద్ శిల్పకళావేదికలో సోగ్గాడే చిన్ని నాయనా వంద రోజుల వేడుకను అట్టహాసంగా సెలబ్రేట్ చేయాలని అక్కినేని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. సోగ్గాడే టీం అంతా ఈ ఈవెంట్ కు హాజరుకానుంది. ఈ యూనిట్ తోపాటు అక్కినేని అఖిల్, నాగచైతన్య కూడా ప్రత్యేక అతిథులుగా రాబోతున్నారు. సోగ్గాడే సినిమాకు ఇప్పటికే సీక్వెల్ ప్రకటించిన నాగార్జున… వచ్చే ఏడాది సంక్రాంతికి బంగార్రాజుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
First Published:  6 April 2016 11:43 PM GMT
Next Story