Telugu Global
Cinema & Entertainment

బాబోయ్ నేను ప్రెగ్నెంట్ కాదు అంటున్న హీరోయిన్..!

హీరోయిన్ ల‌వ్ లో ఉంటే ఒక ర‌క‌మైన పుకార్లు.. పెళ్లి అయ్యాక మ‌రో ర‌క‌మైన పుకార్లు.. మొత్తం మీద వాళ్ల‌ను అస‌లు వ‌ద‌ల‌రు. తాజాగా బాలీవుడ్ హాట్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒక‌రైన క‌రీనా క‌పూర్ ప్రెగ్నెంట్ అయ్యింద‌నే రూమ‌ర్స్ బాగా బి టౌన్ లో వినిపించాయి. త‌నకు పెళ్లి అయ్యింది. ప్రెగ్నెంట్ కావ‌డం అనేది పెద్ద విశేషం కాదు కానీ.. ప్ర‌స్తుతం చేతినిండా చిత్రాలు చేస్తున్న స‌మ‌యంలో క‌రీనా క‌పూర్ ప్రెగ్నెంట్ అయ్యిందా అనేది […]

బాబోయ్ నేను ప్రెగ్నెంట్ కాదు అంటున్న హీరోయిన్..!
X

హీరోయిన్ ల‌వ్ లో ఉంటే ఒక ర‌క‌మైన పుకార్లు.. పెళ్లి అయ్యాక మ‌రో ర‌క‌మైన పుకార్లు.. మొత్తం మీద వాళ్ల‌ను అస‌లు వ‌ద‌ల‌రు. తాజాగా బాలీవుడ్ హాట్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒక‌రైన క‌రీనా క‌పూర్ ప్రెగ్నెంట్ అయ్యింద‌నే రూమ‌ర్స్ బాగా బి టౌన్ లో వినిపించాయి. త‌నకు పెళ్లి అయ్యింది. ప్రెగ్నెంట్ కావ‌డం అనేది పెద్ద విశేషం కాదు కానీ.. ప్ర‌స్తుతం చేతినిండా చిత్రాలు చేస్తున్న స‌మ‌యంలో క‌రీనా క‌పూర్ ప్రెగ్నెంట్ అయ్యిందా అనేది సందేహాం. మొత్తం మీద ఈ రూమ‌ర్స్ పై క‌రీనా నోరు విప్పింది.

ఇటీవల ఏదో అనుమానం వచ్చి క‌రీనా క‌పూర్ గైనకాలజిస్టును సంప్రదించారట. ఇక అంతే కరీనా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన ఈ అమ్మడు తను ప్రెగ్నెంట్ కాదని స్పష్టం చేసింది. దాంతో పాటు మరో రెండేళ్లపాటు తల్లిని కావడానికి ఇష్టపడటం లేదని కూడా చెప్పుకొచ్చింది. నలబై ఏళ్ల వయసులోనూ తల్లి కావచ్చునని గతంలో చెప్పిన మాటల్నే కరీనా నిజం చేస్తారేమోనని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కరీనా కపూర్, అర్జున్ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘కి అండ్ కా’ ఇటీవలే విడుదలై సక్సెస్ బాట పట్టింది. ప్ర‌స్తుతానికి హీరోయిన్ గా పూర్వ వైభోవాని అంది పుచ్చుకోవాల‌నే ఆలోచ‌న తో క‌రీనా క‌పూర్ వ‌ర్క్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి తన భర్త‌ చోటా న‌వ‌బ్ సైఫ్ అలీఖాన్ ఏమంటాడో..!

First Published:  7 April 2016 5:59 AM GMT
Next Story