Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ లో సర్దార్ కు లైన్ క్లియన్

మరో రెండు రోజుల్లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా భారీస్థాయిలో విడుదలకాబోతోంది. అయితే ఈ సినిమా హిందీలో విడుదల అవుతుందా అవ్వదా అనే టెన్షన్ అందర్లో ఉండేది. ఎందుకంటే… ఈ సినిమాకు లీగల్ నోటీసు పంపించాడు అర్బాజ్ ఖాన్. కాపీరైట్ యాక్ట్ కింద… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా యూనిట్ నుంచి వివరణ కోరాడు. ఈ సినిమా ట్రయిలర్, లుక్స్ అన్నీ తను నిర్మించిన దబంగ్-2 సినిమాను పోలి ఉన్నాయని ఆరోపించిన అర్బాజ్ ఖాన్…. సరైన వివరణ […]

బాలీవుడ్ లో సర్దార్ కు లైన్ క్లియన్
X

మరో రెండు రోజుల్లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా భారీస్థాయిలో విడుదలకాబోతోంది. అయితే ఈ సినిమా హిందీలో విడుదల అవుతుందా అవ్వదా అనే టెన్షన్ అందర్లో ఉండేది. ఎందుకంటే… ఈ సినిమాకు లీగల్ నోటీసు పంపించాడు అర్బాజ్ ఖాన్. కాపీరైట్ యాక్ట్ కింద… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా యూనిట్ నుంచి వివరణ కోరాడు. ఈ సినిమా ట్రయిలర్, లుక్స్ అన్నీ తను నిర్మించిన దబంగ్-2 సినిమాను పోలి ఉన్నాయని ఆరోపించిన అర్బాజ్ ఖాన్…. సరైన వివరణ ఇచ్చేంత వరకు సినిమాను హిందీలో విడుదల చేయకూడదంటూ కోర్టు నోటీసులు జారీ చేశాడు. దీంతో సర్దార్ టీం, స్క్రీనింగ్ కమిటీతో కలిసి ప్రత్యేకంగా అర్బాజ్ కు సినిమా చూపించింది. దబంగ్-2, సర్దార్ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్క్రీనింగ్ కమిటీ తేల్చింది. అర్బాజ్ ఖాన్ పంపిన లీగల్ నోటీసుకు అర్థం లేదని తేల్చిచెప్పింది. మరోవైపు సినిమా చూసిన అర్బాజ్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. సినిమాను కూడా ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. దీంతో సర్దార్ హిందీ రిలీజ్ కు అడ్డంకి తొలిగింది.

First Published:  5 April 2016 10:18 PM GMT
Next Story