Telugu Global
Cinema & Entertainment

క్లయిమాక్స్ కు చేరిన మహేష్ మూవీ

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నాడు మహేష్. కాజల్, ప్రణీత, సమంత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ క్ల్లైమాక్స్ కు చేరుకుంది. ఈమధ్య కాలంలో ఓ సినిమాను మహేష్ ఇంత త్వరగా పూర్తిచేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా క్లయిమాక్స్ దృశ్యాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈనెల 10వ తేదీ వరకు ఈ సినిమా షెడ్యూల్ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఉగాది కానుకగా… ఏప్రిల్ 8న బ్రహ్మోత్సవం నుంచి మరో […]

క్లయిమాక్స్ కు చేరిన మహేష్ మూవీ
X

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నాడు మహేష్. కాజల్, ప్రణీత, సమంత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ క్ల్లైమాక్స్ కు చేరుకుంది. ఈమధ్య కాలంలో ఓ సినిమాను మహేష్ ఇంత త్వరగా పూర్తిచేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా క్లయిమాక్స్ దృశ్యాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈనెల 10వ తేదీ వరకు ఈ సినిమా షెడ్యూల్ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఉగాది కానుకగా… ఏప్రిల్ 8న బ్రహ్మోత్సవం నుంచి మరో టీజర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఫిలింసిటీలో షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే…. నాలుగు రోజుల గ్యాప్ లో…. అంటే ఏప్రిల్ 14న బ్రహ్మోత్సవం ఆడియోను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు. సినిమాను మే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఆడియో ఫంక్షన్ రోజున రిలీజ్ డేను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

First Published:  5 April 2016 11:59 PM GMT
Next Story