Telugu Global
Cinema & Entertainment

స‌ర్ధార్... సూర్య‌... మ‌ధ్య లో  బ‌న్నీ..!

ఏదైనా కాస్త పెద్ద పండ‌గ అంటే మ‌న ఫిల్మ్ మేక‌ర్స్ కు  ఒక ఆశ వుంటుంది.  త‌మ చిత్రాల్ని  అవ‌కాశం వుంటే పండ‌గ బ‌రిలో దింపాల‌ని.  అలాగే  బ‌న్నీ  , బోయ‌పాటి శీను కాంబినేష‌న్ లో చేసిన స‌రైనోడు చిత్రం ముందుగా  ఉగాది పండ‌గ రోజు రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ అదే రోజు  ప‌వ‌ర్ స్టార్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం రిలీజ్ కు సిద్దం కావ‌డంతో.. స‌రైనోడు సినిమా  రిలీజ్ ఎప్పుడు వుంటుంది అనేది స్ప‌ష్టంగా  […]

స‌ర్ధార్... సూర్య‌... మ‌ధ్య లో  బ‌న్నీ..!
X

ఏదైనా కాస్త పెద్ద పండ‌గ అంటే మ‌న ఫిల్మ్ మేక‌ర్స్ కు ఒక ఆశ వుంటుంది. త‌మ చిత్రాల్ని అవ‌కాశం వుంటే పండ‌గ బ‌రిలో దింపాల‌ని. అలాగే బ‌న్నీ , బోయ‌పాటి శీను కాంబినేష‌న్ లో చేసిన స‌రైనోడు చిత్రం ముందుగా ఉగాది పండ‌గ రోజు రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ అదే రోజు ప‌వ‌ర్ స్టార్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం రిలీజ్ కు సిద్దం కావ‌డంతో.. స‌రైనోడు సినిమా రిలీజ్ ఎప్పుడు వుంటుంది అనేది స్ప‌ష్టంగా తేల్చి చెప్ప‌లేదు. సెకండ్ వీక్ లో రిలీజ్ చేసుకుందామ‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్లు అనుకున్నారు. క‌ట్ చేస్తే స‌రైనోడు రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 22 న విడుద‌ల చేయాల‌ని డేట్ ఫిక్స్ చేశారు.

యితే తాజాగా మరో స్టార్ హీరోతో బన్నీకి పోటి తప్పేలా లేదు. సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్య హీరోగా 24 సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించినా అప్పటికి, సర్దార్ హవా ఇంకా కొనసాగుతుందనే ఆలోచనతో ఈ సినిమాను ఏప్రిల్ 22న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.దీంతో సింగిల్ గా వ‌ద్దామ‌నుకున్న బ‌న్నీకి సూర్య రూపంలో మ‌రో పోటి త‌ప్పేలా లేదంటున్నారు క్రిటిక్స్.

Click on Image to Read:

sardaar-gabbar-singh

allu-arjun

ramcharan

Bahubali-sardar

chiru1

ram-charan-bunny
pawan
alluarjun

First Published:  6 April 2016 7:04 AM GMT
Next Story