Telugu Global
Cinema & Entertainment

ఎవడో ఒకడు దొరకడం లేదేంటి....

దిల్ రాజు తాజా చిత్రం ఎవడో ఒకడు. వేణు శ్రీరాం ఈ సినిమా స్క్రిప్ట్ ను చాన్నాళ్ల కిందటే రెడీ చేశాడు. ఎట్టకేలకు మాస్ రాజా రవితేజ రూపంలో హీరో దొరికాడు. దిల్ రాజు-రవితేజ కాంబినేషన్ లో సినిమా అంటూ ప్రచారం బాగానే జరిగింది. సినిమాకు కొబ్బరి కాయ కూడా కొట్టారు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో ఆ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకున్నాడు. తర్వాత ఆ స్క్రిప్ట్ లోకి నాగార్జున […]

ఎవడో ఒకడు దొరకడం లేదేంటి....
X

దిల్ రాజు తాజా చిత్రం ఎవడో ఒకడు. వేణు శ్రీరాం ఈ సినిమా స్క్రిప్ట్ ను చాన్నాళ్ల కిందటే రెడీ చేశాడు. ఎట్టకేలకు మాస్ రాజా రవితేజ రూపంలో హీరో దొరికాడు. దిల్ రాజు-రవితేజ కాంబినేషన్ లో సినిమా అంటూ ప్రచారం బాగానే జరిగింది. సినిమాకు కొబ్బరి కాయ కూడా కొట్టారు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో ఆ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకున్నాడు. తర్వాత ఆ స్క్రిప్ట్ లోకి నాగార్జున ఎంటరయ్యాడు. ఎవడో ఒకడు సినిమా చేస్తున్నట్టు స్వయంగా నాగ్ ప్రకటించాడు కూడా. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి నాగ్ కూడా తప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. నిర్మాత దిల్ రాజు, నాగ్ మద్య పారితోషికం విషయంలో అభిప్రాయబేధాలు వచ్చినట్టు చెబుతున్నారు. సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాగార్జున…. కాస్త ఎక్కువ కోట్ చేశాడని చెబుతున్నారు. విషయం పక్కాగా తెలియనప్పటికీ…. ఎవడో ఒకడు ప్రాజెక్టు నుంచి నాగార్జున తప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారి ఈ కథ, ఏ హీరో దగ్గరకు వెళ్తుందో చూడాలి.

First Published:  5 April 2016 3:57 AM GMT
Next Story