Telugu Global
Cinema & Entertainment

రిలీజ్ కు ముందే బాహుబలిని దాటేశాడు

పవన్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో తెలియజెప్పే వార్త ఇది. రికార్డులు సృష్టించి, చరిత్రను తిరగరాసిన బాహుబలి సినిమాను…. తన సినిమా విడుదలకు ముందే పవన్ కల్యాణ్ అధిగమించాడు. ఒక విషయంలో కాదు… ఏకంగా రెండు విషయాల్లో బాహుబలి సినిమాను సర్దార్ గబ్బర్ సింగ్ దాటేశాడు. బాహుబలి సినిమాను ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో విడుదల చేశారు. సినిమాకు హిట్ టాక్ వచ్చిన తర్వాత మరో 10 దేశాలకు విడుదలను విస్తరించారు. కానీ సర్దార్ గబ్బర్ […]

రిలీజ్ కు ముందే బాహుబలిని దాటేశాడు
X

పవన్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో తెలియజెప్పే వార్త ఇది. రికార్డులు సృష్టించి, చరిత్రను తిరగరాసిన బాహుబలి సినిమాను…. తన సినిమా విడుదలకు ముందే పవన్ కల్యాణ్ అధిగమించాడు. ఒక విషయంలో కాదు… ఏకంగా రెండు విషయాల్లో బాహుబలి సినిమాను సర్దార్ గబ్బర్ సింగ్ దాటేశాడు. బాహుబలి సినిమాను ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో విడుదల చేశారు. సినిమాకు హిట్ టాక్ వచ్చిన తర్వాత మరో 10 దేశాలకు విడుదలను విస్తరించారు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను ఒకేసారి 50 దేశాల్లో విడుదల చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ ధరలు కూడా బాహుబలిని మించిపోయాయి. బాహుబలి సినిమా బెనిఫిట్ షో టిక్కెట్టు ధర దాదాపు 5వేల రూపాయల వరకు వెళ్లింది. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ టికెట్ ధర ఇప్పటికే 10వేల రూపాయలు దాటేసింది. మరో రెండు రోజుల్లో 20వేల రూపాయలకు కూడా చేరుకోవచ్చని అంటున్నారు. 7వ తేదీ అర్థరాత్రి నుంచి 8వ తేదీ ఉదయం వరకు ఏకథాటిగా వివిధ ప్రాంతాల్లో సర్దార్ ప్రీమియర్లు ఉంటాయి. హైదరాబాద్ లో ఏకంగా 40 థియేటర్లలో సర్దార్ ప్రీమియర్ ప్లాన్ చేశారు.

Click on Image to Read:

sardaar-gabbar-singh

pawan-surya-bunny

pawan

allu-arjun

ramcharan

chiru1

ram-charan-bunny

alluarjun

rgv1

First Published:  5 April 2016 12:39 AM GMT
Next Story