Telugu Global
Cinema & Entertainment

బన్నీ గూటికి చేరిన చెర్రీ భామ

చెర్రీతో కలిసి నటించిన హీరోయిన్లను రిపీట్ చేయడం బన్నీకి కొత్తేం కాదు. గతంలో కూడా జరిగింది. బ్రూస్ లీ సినిమాలో చెర్రీ సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ను తన కొత్త సినిమా సరైనోడులో తీసుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా మరోసారి ఇదే ఫార్ములాను రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. సరైనోడు సినిమాను పూర్తిచేసిన బన్నీ… త్వరలోనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ సినిమాలో కుదిరితే అమీజాక్సన్ ను హీరోయిన్ గా […]

బన్నీ గూటికి చేరిన చెర్రీ భామ
X

చెర్రీతో కలిసి నటించిన హీరోయిన్లను రిపీట్ చేయడం బన్నీకి కొత్తేం కాదు. గతంలో కూడా జరిగింది. బ్రూస్ లీ సినిమాలో చెర్రీ సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ను తన కొత్త సినిమా సరైనోడులో తీసుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా మరోసారి ఇదే ఫార్ములాను రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. సరైనోడు సినిమాను పూర్తిచేసిన బన్నీ… త్వరలోనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ సినిమాలో కుదిరితే అమీజాక్సన్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. గతంలో చెర్రీ నటించిన ఎవడు సినిమాలో అమీ జాక్సన్ సెకెండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఈ భామ రజనీకాంత్-శంకర్ కాంబోలో వస్తున్న రోబో 2.0 సినిమాలో నటిస్తోంది. భారీ స్థాయిలో, అత్యధిక కాల్షీట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అమీకు కాస్త విశ్రాంతి దొరికితే… బన్నీ సినిమాకు కాల్షీట్లు కేటాయిస్తుంది. లేదంటే మరో హీరోయిన్ ను వెదుక్కోవాల్సిందే.

First Published:  5 April 2016 1:00 AM GMT
Next Story