Telugu Global
CRIME

తాళి కట్టిన వెంట‌నే ఉరేసుకున్న పెళ్లి కొడుకు!

పెళ్లి కూతురు మెడ‌లో తాళి క‌ట్టి కొన్ని గంట‌లు మాత్ర‌మే కావొస్తోంది.. విందు ముగిసింది. ఓ వైపు కొత్త జంట‌ను వాహ‌నంలో ఊరేగిస్తున్నారు. మ‌రోవైపు.. బారాత్ జోరుగా సాగుతోంది. పెళ్లికి వ‌చ్చిన బంధువులంతా.. ఉత్సాహంగా చిందులు వేస్తున్నారు. ఇంత‌లో మంచినీళ్లు తాగి వ‌స్తాన‌ని వాహ‌నం దిగిన పెళ్లికొడుకు ప‌క్క‌కు వెళ్లి ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న‌ ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లం ధ‌రంప‌ల్లిలో శ‌నివారం జ‌రిగింది. వివ‌రాలు.. ధ‌రంప‌ల్లికి చెందిన కావుడే స‌దాశిశ్ (25)కు కౌటాల […]

తాళి కట్టిన వెంట‌నే ఉరేసుకున్న పెళ్లి కొడుకు!
X
పెళ్లి కూతురు మెడ‌లో తాళి క‌ట్టి కొన్ని గంట‌లు మాత్ర‌మే కావొస్తోంది.. విందు ముగిసింది. ఓ వైపు కొత్త జంట‌ను వాహ‌నంలో ఊరేగిస్తున్నారు. మ‌రోవైపు.. బారాత్ జోరుగా సాగుతోంది. పెళ్లికి వ‌చ్చిన బంధువులంతా.. ఉత్సాహంగా చిందులు వేస్తున్నారు. ఇంత‌లో మంచినీళ్లు తాగి వ‌స్తాన‌ని వాహ‌నం దిగిన పెళ్లికొడుకు ప‌క్క‌కు వెళ్లి ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న‌ ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లం ధ‌రంప‌ల్లిలో శ‌నివారం జ‌రిగింది. వివ‌రాలు.. ధ‌రంప‌ల్లికి చెందిన కావుడే స‌దాశిశ్ (25)కు కౌటాల మండ‌లం క‌న్నెప‌ల్లికి చెందిన అమృత‌తో శ‌నివారం ఘ‌నంగా పెళ్లి జ‌రిగింది. రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో బారాత్ (ఊరేగింపు) ప్రారంభ‌మైంది. గంట గ‌డిచాక‌.. పెళ్లికొడుకు నీళ్లు తాగి వ‌స్తాన‌ని వాహ‌నం దిగాడు. ఎంత‌సేప‌టికీ రాక‌పోవ‌డంతో బారాత్ నిలిపివేశారు. అత‌నికోసం వెదికారు. ప‌క్క‌నే ఉన్న వాగులో ఉన్న చెట్టుకు స‌దాశివ్ ఉరేసుకుని క‌నిపించాడు. దీంతో పెళ్లి కూతురు, ఆమె బంధువులకు ఏం చేయాలో పాలుపోలేదు. అస‌లు పెళ్లికొడుకు ఇలా ఎందుకు చేశాడు? ఈ మాత్రం దానికి అమ్మాయి మెడ‌లో తాళి క‌ట్ట‌డ‌మెందుకు? అంటూ వారు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Click on Image to Read:

saritha-nair

jyothula-nehrurayapti

revanth-jagan-k

99

gali-janardhan

5

kodali-nani

roja-final

rajamouli

venkaiah-naidu

First Published:  3 April 2016 11:59 PM GMT
Next Story