ప్రతిష్టాత్మక సినిమాకు రొటీన్ డైలాగ్
చిరంజీవి 150వ సినిమా దాదాపు రెండేళ్లుగా ఊరిస్తోంది. ఎప్పుడు సినిమా ఎనౌన్స్ చేస్తాడా… ఎప్పుడు పండగ చేసుకుందామా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టే ఎప్పటికప్పుడు ఫీలర్లు రిలీజ్ చేస్తూ… సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాడు చిరు. న్యూ లుక్ అంటూ ఒకసారి, హీరోయిన్ అంటూ మరోసారి సినిమాను రెండేళ్లుగా ప్రజల మధ్యలో లైవ్ గా ఉంచుతూనే ఉన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది కానీ… తాజాగా వచ్చిన ఓ వార్త మాత్రం అభిమానులకు మింగుడుపడ్డం […]
BY sarvi4 April 2016 7:14 AM GMT
X
sarvi Updated On: 4 April 2016 7:24 AM GMT
చిరంజీవి 150వ సినిమా దాదాపు రెండేళ్లుగా ఊరిస్తోంది. ఎప్పుడు సినిమా ఎనౌన్స్ చేస్తాడా… ఎప్పుడు పండగ చేసుకుందామా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టే ఎప్పటికప్పుడు ఫీలర్లు రిలీజ్ చేస్తూ… సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాడు చిరు. న్యూ లుక్ అంటూ ఒకసారి, హీరోయిన్ అంటూ మరోసారి సినిమాను రెండేళ్లుగా ప్రజల మధ్యలో లైవ్ గా ఉంచుతూనే ఉన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది కానీ… తాజాగా వచ్చిన ఓ వార్త మాత్రం అభిమానులకు మింగుడుపడ్డం లేదు. మెగాస్టార్ 150వ సినిమాకు కత్తిలాంటోడు అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. రెస్పాన్స్ చెక్ చేద్దామని ఈ పేరును బయటకు లీక్ చేశారో లేక ముందుగానే టైటిల్ ఫిక్స్ చేసి ప్రకటించారో తెలీదు కానీ… టైటిల్ పై మాత్రం ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన 150వ సినిమాకు రొటీన్ గా టైటిల్ పెట్టడం ఏంటని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే సరైనోడు, పోలీసోడు, స్పీడున్నోడు లాంటి పలు టైటిల్స్ వచ్చాయి. వాటిని కాపీకొడుతూ కత్తిలాంటోడు అనే టైటిల్ ను పెట్టడం మాత్రం ఏం బాగాలేదంటున్నారు 90శాతం అభిమానులు. టైటిల్ లో మాస్ అప్పీల్ ఉన్నప్పటికీ, కాపీ కొట్టినట్టు అనిపించడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
Next Story