ఇవన్నీ... బ్రెయిన్‌కి బంపర్ ఆఫర్లు!
చురుకుదనం, తెలివితేటలతో మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర ఇవన్నీ సరే…వీటితో పాటు ఇంకా ప్రత్యేకంగా మెదడు శక్తిని పెంచేందుకు ఏం చేయవచ్చు….ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సమాచారం- నృత్యం మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. అది సాల్సా అయినా, భరతనాట్యమైనా…డ్యాన్సులు చేసేవారిలో మెదడు చురుగ్గా ఉంటుందని, వారిలో మతిమరుపు వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నృత్యంతో మెదడులో రక్త ప్రసరణ చక్కగా, వేగంగా జరుగుతుంది. వ్యాయామంతోనూ […]
BY sarvi4 April 2016 2:29 AM GMT
X
sarvi Updated On: 4 April 2016 3:22 AM GMT
చురుకుదనం, తెలివితేటలతో మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర ఇవన్నీ సరే…వీటితో పాటు ఇంకా ప్రత్యేకంగా మెదడు శక్తిని పెంచేందుకు ఏం చేయవచ్చు….ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సమాచారం-
- నృత్యం మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. అది సాల్సా అయినా, భరతనాట్యమైనా…డ్యాన్సులు చేసేవారిలో మెదడు చురుగ్గా ఉంటుందని, వారిలో మతిమరుపు వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నృత్యంతో మెదడులో రక్త ప్రసరణ చక్కగా, వేగంగా జరుగుతుంది.
- వ్యాయామంతోనూ మెదడు చురుగ్గా ఉంటుంది. కానీ రోజూ ఒకేరకం వర్కవుట్లు కాకుండా, భిన్న వ్యాయామాలు కావాలని శరీరమే కాదు, మెదడు కూడా కోరుకుంటుందని, భిన్నరకాల వ్యాయామాలు చేసేవారిలో మెదడు చురుగ్గా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
- ఇక ఒక కొత్త భాషని నేర్చుకుంటే మెదడు శక్తిని మనం ఎంతగానో పెంచుకున్నట్టే అని ఇప్పటికే చాలా పరిశోధనల్లో తేలింది. కొత్త విషయాలు నేర్పితే, నేర్చితే మెదడు శక్తి పెరుగుతుందన్నమాట. మెదడుకి కుతూహలమే ఊపిరి మరి.
- చెస్, క్యారమ్స్, వర్డ్ గేమ్స్, జనరల్ నాలెడ్జి పెంచే ఆటలు…ఇవన్నీ మెదడుకి ఎంతో ఉత్సహాన్ని ఇస్తాయి. దాని శక్తిని పెంచుతాయి
- ఒక డైరీలో మన మనసులోని భావాలన్నీ రాస్తూ ఉండటం కూడా మెదడుకి ఎంతో హాయిని, శక్తిని ఇస్తుంది. మనసులో ఉన్న ఫీలింగ్స్‌ని, రోజువారీ పనులను ఇలా అన్నింటినీ పేపరుమీద పెడుతుంటే- మెదడు తన పనులను మరింత వేగంగా చేస్తుందట. అయితే ఈ ఫలితం పొందాలంటే కీ బోర్డుమీద టైప్ చేయడం కాదు…. చేత్తో రాయాల్సిందే.
- పనులు చేస్తున్నపుడు ఆదరాబాదరాగా కాకుండా సరిపడా టైమ్‌ని కేటాయిస్తే మెదడుకి చురుగ్గా పనిచేయడం అలవాటవుతుందట.
- పగటిపూట పది లేదా ఓ ఇరువై నిముషాల పాటు నిద్రపోతే మెదడులో ఉత్సాహం, శక్తి పునరుత్పత్తి అవుతాయి.
- గిటార్, వాయొలిన్, పియానో, ఫ్లూట్, డ్రమ్స్….వీటిని నేర్చుకుని సాధన చేస్తే మెదడు ఎంతో ఉత్తేజపూరితంగా తయారవుతుంది. అంటే…. వీటిలో నైపుణ్యం సాధించి ప్రదర్శనలు చేయగలమా ఏంటి…అనే అనుమానం పెట్టుకోకుండా…. అంతకంటే పెద్ద ప్రయోజనం మెదడుని చురుగ్గా ఉంచుకోవడానికి కూడా వీటిని నేర్చుకోవచ్చన్నమాట.
- పుస్తకాలు చదవటం…మెదడుకి ఎంతో నచ్చిన విషయం. దానికి ఎంతో మంచి వ్యాయామం ఇది.
Next Story