Telugu Global
National

ఎనీ టైమ్ మ‌నీ.. కాదు డే టైమ్ మ‌నీ

ఏటీఎం అంటే ఎనీ టైమ్ మ‌నీగా మ‌నంద‌రికీ తెలిసిందే! ఇక‌పై దీనిని డే టైమ్ మ‌నీగా పిల‌వాలేమో! త్వ‌ర‌లో దీనిపై కేంద్రం తీసుకోబోయే నిర్ణ‌య‌మే ఇందుకు కార‌ణం. రాత్రిపూట ఏటీఎం చోరీలు, ఏటీఎంల‌లో మ‌హిళ‌ల‌పై అకృత్యాల నివార‌ణ నేప‌థ్యంలో ఇక‌పై రాత్రిపూట ఏటీఎంల‌లో డ‌బ్బులు నింప‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. ఇంత‌కుముందు మారుమూల‌, న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాల్లోని ఇలాంటి ప‌ద్ధ‌తి అవలంబించేవారు. కానీ, ఇక‌పై దేశ‌వ్యాప్తంగా ఇదే  ప‌ద్ధ‌తిని కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది. అంటే సాయంత్రం ఐదు గంట‌ల త‌రువాత ఇక […]

ఎనీ టైమ్ మ‌నీ.. కాదు డే టైమ్ మ‌నీ
X
ఏటీఎం అంటే ఎనీ టైమ్ మ‌నీగా మ‌నంద‌రికీ తెలిసిందే! ఇక‌పై దీనిని డే టైమ్ మ‌నీగా పిల‌వాలేమో! త్వ‌ర‌లో దీనిపై కేంద్రం తీసుకోబోయే నిర్ణ‌య‌మే ఇందుకు కార‌ణం. రాత్రిపూట ఏటీఎం చోరీలు, ఏటీఎంల‌లో మ‌హిళ‌ల‌పై అకృత్యాల నివార‌ణ నేప‌థ్యంలో ఇక‌పై రాత్రిపూట ఏటీఎంల‌లో డ‌బ్బులు నింప‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. ఇంత‌కుముందు మారుమూల‌, న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాల్లోని ఇలాంటి ప‌ద్ధ‌తి అవలంబించేవారు. కానీ, ఇక‌పై దేశ‌వ్యాప్తంగా ఇదే ప‌ద్ధ‌తిని కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది. అంటే సాయంత్రం ఐదు గంట‌ల త‌రువాత ఇక ఏటీఎంల్లో ఎలాంటి డ‌బ్బు నింప‌రు. అందులో ఉంటే ఉన్న‌ట్లు.. లేదంటే ఇక అంతే సంగ‌తులు!
అయితే, ఈ నిర్ణ‌యంపై ఇప్ప‌టి నుంచే వినియోగ‌దారుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. బ్యాంకులు ఉన్నా లేకున్నా.. రాత్రి ప‌గ‌లూ తేడా లేకుండా డ‌బ్బు కోసం ఏటీఎంల‌ను ఆశ్రయించేవాళ్లమ‌ని, ఇప్పుడు ఏదో కార‌ణాలు చెప్పి ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల విప‌త్క‌ర ప‌రిస్థితులు, డ‌బ్బు అత్య‌వ‌స‌రంగా ఉన్న వాళ్లు ఎక్క‌డికి వెళ్తార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే దేశంలో అత్య‌ధిక సెల‌వులు వినియోగించుకుంటున్న ఉద్యోగులుగా బ్యాంకు సిబ్బందిపై వినియోగ‌దారులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. దీనికితోడు ఇటీవ‌ల రెండో, నాలుగో శ‌నివారాలు సెల‌వుదినాలుగా ప్ర‌క‌టించాయి. ఇది ఖాతాదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దీనికితోడు తాజా నిర్ణ‌యంపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త చూసి అయినా కేంద్రం పునాలోచిస్తుందా? లేదా? అన్న‌ది త్వ‌ర‌లోనే తేలిపోనుంది.
First Published:  3 April 2016 6:43 PM GMT
Next Story