Telugu Global
Cinema & Entertainment

 విశాఖపై బన్నీకి ఎందుకంత ప్రేమ...?

సరైనోడు సినిమా ఆడియో విజయోత్సవ సభను విశాఖ సాగరతీరంలో ఏర్పాటుచేయాలని ఫిక్స్ చేశారు. ఈనెల 10న వైజాగ్ బీచ్ లో అట్టహాసంగా సరైనోడు ఆడియో విజయోత్సవ సభ జరుగుతుంది. ఈ విషయాన్ని విశాఖలో ఏర్పాటుచేసిన ఓ ఫైవ్ స్టార్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్, మంత్రి గంటా శ్రీనివాసరావు సగర్వంగా ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ… విశాఖపై బన్నీకి ఒక్కసారిగా ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే […]

 విశాఖపై బన్నీకి ఎందుకంత ప్రేమ...?
X
సరైనోడు సినిమా ఆడియో విజయోత్సవ సభను విశాఖ సాగరతీరంలో ఏర్పాటుచేయాలని ఫిక్స్ చేశారు. ఈనెల 10న వైజాగ్ బీచ్ లో అట్టహాసంగా సరైనోడు ఆడియో విజయోత్సవ సభ జరుగుతుంది. ఈ విషయాన్ని విశాఖలో ఏర్పాటుచేసిన ఓ ఫైవ్ స్టార్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్, మంత్రి గంటా శ్రీనివాసరావు సగర్వంగా ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ… విశాఖపై బన్నీకి ఒక్కసారిగా ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే వైజాగ్ పై ప్రేమ పుట్టుకొచ్చింది బన్నీకి కాదు. అతడి తండ్రి అల్లు అరవింద్ కి. అవును… విశాఖపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు అల్లు అరవింద్. కుదిరితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంలో చిత్రపరిశ్రమకు సంబంధించి ఓ పెద్ద ఫిలిం స్టుడియో నిర్మించే ఆలోచనలో అరవింద్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవికి కూడా విశాఖలో భూములున్నట్టు సమాచారం. వీళ్లతోపాటు గంటా శ్రీనివాసరావు కూడా సంయుక్తంగా విశాఖలో ఓ మెగా ఫిలింసిటీ పార్క్ ను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారట. ఇందులో భాగంగానే ముందుగా బన్నీని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. చూస్తుంటే… ఇకపై మెగాఫ్యామిలీకి చెందిన చాలా ఫంక్షన్లు విశాఖలోనే జరిగే అవకాశాలున్నాయి.
First Published:  4 April 2016 7:28 AM GMT
Next Story