Telugu Global
Cinema & Entertainment

 రికార్డుల కోసం రివర్స్ ప్లాన్

ఎలాగైనా రికార్డులు తిరగరాయాలనుకుంటే వింత ఆలోచనలే వస్తాయి. వసూళ్లలో కొత్త ఎత్తులు అందుకోవాలని పరితపిస్తే… పాడు ఆలోచనలే పుడతాయి. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో అలాంటిదే ఏదో తెరవెనక జరుగుతోందని అంటున్నారు. ఈ సినిమాకు తొలి వీకెండ్ లోనే అత్యధిత వసూళ్లు రాబట్టే ఉద్దేశంతో… నిర్మాతలు ఓ కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. ఏపీలో ప్రతి థియేటర్లలో టిక్కెట్ రేట్లను ఫ్లాట్ గా మార్చేయాలని అనుకుంటున్నారు. అంటే… నేల నుంచి బాల్కనీ వరకు అన్ని టిక్కెట్లు సమానంగా […]

 రికార్డుల కోసం రివర్స్ ప్లాన్
X
ఎలాగైనా రికార్డులు తిరగరాయాలనుకుంటే వింత ఆలోచనలే వస్తాయి. వసూళ్లలో కొత్త ఎత్తులు అందుకోవాలని పరితపిస్తే… పాడు ఆలోచనలే పుడతాయి. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో అలాంటిదే ఏదో తెరవెనక జరుగుతోందని అంటున్నారు. ఈ సినిమాకు తొలి వీకెండ్ లోనే అత్యధిత వసూళ్లు రాబట్టే ఉద్దేశంతో… నిర్మాతలు ఓ కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. ఏపీలో ప్రతి థియేటర్లలో టిక్కెట్ రేట్లను ఫ్లాట్ గా మార్చేయాలని అనుకుంటున్నారు. అంటే… నేల నుంచి బాల్కనీ వరకు అన్ని టిక్కెట్లు సమానంగా ఉంటాయన్నమాట. ఉదాహరణకు టిక్కెట్ రేటును 150గా నిర్ణయిస్తే… నేల టిక్కెట్ కైనా 150 చెల్లించాల్సిందే. ఇలా విడుదలైన వారం రోజుల పాటు పెట్టాలనే ఆలోచనలో సర్దార్ టీం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి ఏపీ సర్కార్ నుంచి ప్రత్యేక అనుమతి కూడా కోరినట్టు సమాచారం అందుతోంది. పవన్ అంటే ప్రత్యేక అభిమానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో అతడికే సహాయం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే… వసూళ్ల కోసం ఇలా సగటు ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెట్టడం ఎంత వరకు సమంజసం అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే మంచిది.
First Published:  2 April 2016 10:28 PM GMT
Next Story