Telugu Global
Cinema & Entertainment

శ్రీజ ఫంక్షన్ లో బాహుబలిపై క్లారిటీ

బాహుబలి సినిమాకు సంబంధించి ఈమధ్య చాలా పెద్ద ప్రచారం జరిగింది. సినిమాలో ఓ పాత్ర కోసం ప్రియాంక చోప్రా లేదా దీపిక పదుకోన్ ను తీసుకుంటున్నారంటూ కథనాలు వచ్చాయి. దీపికా పదుకునే కోసమే మ్యాగ్జిమమ్ ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ కథనాల్లో నిజం లేదని బాహుబలి టీం ప్రకటించింది. తమ సినిమాలో దీపికా పదుకోన్ ఉందనే ప్రచారం కేవలం కల్పితమని టీం స్పష్టంచేసింది. చిరంజీవి తనయ శ్రీజ వెడ్డింగ్ రిసెప్షన్ కు దర్శకుడు రాజమౌళితో […]

శ్రీజ ఫంక్షన్ లో బాహుబలిపై క్లారిటీ
X
బాహుబలి సినిమాకు సంబంధించి ఈమధ్య చాలా పెద్ద ప్రచారం జరిగింది. సినిమాలో ఓ పాత్ర కోసం ప్రియాంక చోప్రా లేదా దీపిక పదుకోన్ ను తీసుకుంటున్నారంటూ కథనాలు వచ్చాయి. దీపికా పదుకునే కోసమే మ్యాగ్జిమమ్ ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ కథనాల్లో నిజం లేదని బాహుబలి టీం ప్రకటించింది. తమ సినిమాలో దీపికా పదుకోన్ ఉందనే ప్రచారం కేవలం కల్పితమని టీం స్పష్టంచేసింది. చిరంజీవి తనయ శ్రీజ వెడ్డింగ్ రిసెప్షన్ కు దర్శకుడు రాజమౌళితో పాటు… బాహుబలి నిర్మాతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా… దీపిక ఎంట్రీపై ఆరా తీయగా…. వాళ్లిద్దరూ వీటిని రూమర్లుగా కొట్టిపడేశారు. గతంలో ఇలాంటి రూమర్లు వచ్చినప్పుడు ట్విట్టర్ పై స్పందించే రాజమౌళి…. ఈసారి ఎందుకు స్పందించలేదనే ప్రశ్న కూడా జక్కన్నకు ఎదురైంది. అయితే తన సినిమాపై వస్తున్న పుకార్లకు ఒకేసారి సమాధానం ఇస్తానని రాజమౌళి తెలిపాడు. సో…. బాహుబలి-2 సినిమాకు సంబంధించి రాజమౌళి త్వరలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
First Published:  2 April 2016 10:48 PM GMT
Next Story