Telugu Global
WOMEN

శ‌ని సింగ‌నాపూర్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌!

పురుషుల‌తో స‌మానంగా దేవాల‌యాల్లో ప్ర‌వేశించే హ‌క్కు మ‌హిళ‌ల‌కు ఉంటుంద‌ని, వారిని అడ్డుకోవ‌డానికి వీలులేద‌ని బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన నేప‌థ్యంలో మ‌రొక‌సారి శ‌ని సింగ‌నాపూర్‌, శ‌నీశ్వ‌రాల‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. తృప్తి దేశాయి నాయ‌క‌త్వంలో భూమాత బ్రిగేడ్ మ‌హిళా సంఘం స‌భ్యులు ఆల‌యం వ‌ద్ద‌కు భారీగా చేరుకుని, లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఆల‌యం వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. ఆల‌యంలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన మ‌హిళ‌ల‌ను పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించి త‌మ‌ను అడ్డుకోవ‌డంపై మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాము వెన‌క్కు త‌గ్గేది లేద‌ని […]

శ‌ని సింగ‌నాపూర్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌!
X

పురుషుల‌తో స‌మానంగా దేవాల‌యాల్లో ప్ర‌వేశించే హ‌క్కు మ‌హిళ‌ల‌కు ఉంటుంద‌ని, వారిని అడ్డుకోవ‌డానికి వీలులేద‌ని బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన నేప‌థ్యంలో మ‌రొక‌సారి శ‌ని సింగ‌నాపూర్‌, శ‌నీశ్వ‌రాల‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. తృప్తి దేశాయి నాయ‌క‌త్వంలో భూమాత బ్రిగేడ్ మ‌హిళా సంఘం స‌భ్యులు ఆల‌యం వ‌ద్ద‌కు భారీగా చేరుకుని, లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఆల‌యం వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. ఆల‌యంలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన మ‌హిళ‌ల‌ను పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించి త‌మ‌ను అడ్డుకోవ‌డంపై మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాము వెన‌క్కు త‌గ్గేది లేద‌ని అవ‌స‌ర‌మైతే ముఖ్య‌మంత్రి, హోం మంత్రుల‌పై కేసు పెడ‌తామ‌ని తృప్తి దేశాయి అన్నారు. హైకోర్టు తీర్పు త‌మ‌కు అనుకూలంగా రావ‌డం, లింగ వివ‌క్ష‌మీద తాము చేస్తున్న పోరాటంలో గెలుపుగా భావిస్తున్నామ‌ని ఆమె అన్నారు.

First Published:  2 April 2016 9:50 PM GMT
Next Story