Telugu Global
Cinema & Entertainment

సగం సినిమాకే జాతీయ అవార్డు ఎలా ఇస్తారు ?

ఏదైనా సినిమాకు జాతీయ అవార్డు రావాలంటే దానికి కొన్ని లెక్కలుంటాయి. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చి ఉండాలి. లేదంటే బలమైన కథాంశాన్ని అయినా ఎంచుకొని ఉండాలి. లేదంటే… దర్శకుడి ప్రతిభ వందకు వందశాతం అయినా కనిపించాలి. జాతీయ అవార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాకు కూడా అవార్డు రాలేదు. కానీ తొలిసారిగా బాహుబలి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. అదే టైంలో… ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిందని సంతోషించాలో లేక… వచ్చిన మొట్టమొదటి […]

సగం సినిమాకే జాతీయ అవార్డు ఎలా ఇస్తారు ?
X
ఏదైనా సినిమాకు జాతీయ అవార్డు రావాలంటే దానికి కొన్ని లెక్కలుంటాయి. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చి ఉండాలి. లేదంటే బలమైన కథాంశాన్ని అయినా ఎంచుకొని ఉండాలి. లేదంటే… దర్శకుడి ప్రతిభ వందకు వందశాతం అయినా కనిపించాలి. జాతీయ అవార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాకు కూడా అవార్డు రాలేదు. కానీ తొలిసారిగా బాహుబలి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. అదే టైంలో… ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిందని సంతోషించాలో లేక… వచ్చిన మొట్టమొదటి అవార్డుకే విమర్శలు వస్తున్నాయనే చింతించాలో అర్థం కావడం లేదు.
మొన్నటివరకు అంతా బాహుబలికి ఆకాశానికెత్తేశారు. నిజమే సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ గ్రాఫిక్స్ ఉంటే జాతీయ అవార్డు ఇచ్చేస్తారా…? సినిమాలో నటీనటుల నటన బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు వస్తేగిస్తే జాతీయ అవార్డ్ ప్రభాస్ కు రావాలి. ఇవన్నీ పక్కనపెడితే… బాహుబలి సినిమాలో సందేశం లేదు. సమాజానికి పనికొచ్చే నీతి ఒక్కటి కూడా లేదు. అవార్డు ఇవ్వాలంటే ఇదొక ప్రత్యేక కొలమానం. అది లేకపోయినా బాహుబలిని జాతీయ అవార్డు వరించింది. అన్నింటికంటే ముఖ్యంగా సగం సినిమాకే అవార్డు ఇచ్చారు. ఇలా సగం సినిమాకే అవార్డు ఇచ్చినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఇంకా సగం షూటింగ్ దశలో ఉంది. అంటే… బాహుబలి-2 విడుదలయ్యాక దానికి కూడా జాతీయ అవార్డు ప్రకటిస్తారా… ఇలా జక్కన్న తెరకెక్కించిన సినిమాపై చాలానే విమర్శలు చెలరేగుతున్నాయి. అవార్డుల ప్రదానానికి సందేశం, నీతి, మంచి కథ వంటి అంశాలు కాకుండా వసూళ్ల మొత్తమే ప్రతిపాదికగా తీసుకున్నారా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు విమర్శకులు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో బహుబలికి అవార్డు వచ్చిన సందర్భంగా చంద్రబాబు అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ అందులో ఒక్క రాజమౌళి పేరు తప్పితే హీరోగా నటించిన ప్రభాస్ పేరు గానీ, ఇతర నటుల పేర్లు గాని కనీసం ఉచ్చరించలేదు. కంచె సినిమాకు కూడా ఒక అవార్డు వచ్చింది. తీర్మానంలో కంచె సినిమా పేరును మాత్రమే చదివారు. కంచె చిత్రానికి సంబంధించి కనీసం డైరెక్టర్ పేరు కూడా తీర్మానంలో పొందుపరచలేదు.
First Published:  1 April 2016 11:56 PM GMT
Next Story