Telugu Global
Cinema & Entertainment

హీరో రేంజ్ పెరిగిందా... లేక ఆ డైరెక్టర్ రేంజ్ తగ్గిందా....?

ఓ గమ్మత్తయిన కాంబినేషన్ సెట్ అయింది. అయితే అది సెట్ అయినప్పటి నుంచి పైన మనం హెడ్డింగ్ లో చెప్పుకుంటున్న చర్చ షురూ అయింది. ఇంతకీ ఈ చర్చకు కారణం దర్శకుడు పూరీ జగన్నాధ్, హీరో నారా రోహిత్. వీళ్లిద్దరూ కలిసి త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారట. దీంతో పూరీ రేంజ్ తగ్గిందా… లేక హీరో రేంజ్ పెరిగిందా అంటూ తెగ  చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తున్నాడు […]

హీరో రేంజ్ పెరిగిందా... లేక ఆ డైరెక్టర్ రేంజ్ తగ్గిందా....?
X
ఓ గమ్మత్తయిన కాంబినేషన్ సెట్ అయింది. అయితే అది సెట్ అయినప్పటి నుంచి పైన మనం హెడ్డింగ్ లో చెప్పుకుంటున్న చర్చ షురూ అయింది. ఇంతకీ ఈ చర్చకు కారణం దర్శకుడు పూరీ జగన్నాధ్, హీరో నారా రోహిత్. వీళ్లిద్దరూ కలిసి త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారట. దీంతో పూరీ రేంజ్ తగ్గిందా… లేక హీరో రేంజ్ పెరిగిందా అంటూ తెగ చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం కల్యాణ్ రామ్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాధ్. ఇది సెట్స్ పై ఉంటుండగానే నారా రోహిత్-పూరీ మధ్య చర్చలు జరిగి సినిమా ఫైనలైజ్ అయిందట. ఇప్పటివరకు నారా రోహిత్ పెద్ద దర్శకులతో సినిమాలు చేయలేదు. అంతా యంగ్ టాలెంట్ తోనే పనిచేశాడు. అటు పూరీ కూడా మొన్నటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేసి… చిన్న హీరోలతో ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో… హీరోగా నారా రోహిత్ రేంజ్ పెరిగిందా… లేక దర్శకుడిగా పూరీ జగన్నాధ్ స్థాయి తగ్గిందా అనే చర్చ ఊపందుకుంది. దీనికి సమాధానం మేం చెప్పదలుచుకోలేదు. మీరే నిర్ణయించుకోండి…
First Published:  1 April 2016 10:59 PM GMT
Next Story