Telugu Global
National

బిచ్చ‌గాడికి రూ.65 ల‌క్ష‌ల లాట‌రీ

దేవుడు ఇవ్వాల‌నుకుంటే.. నిద్ర‌లో ఉన్నా లేపి చెంప మీద కొట్టి మ‌రీ ఇస్తాడు.. అని హిందీలో ఓ సామెత నిజ‌మైంది. ధ‌న‌ల‌క్ష్మి ఎప్పుడు ఎవ‌రి త‌లుపు త‌డుతుందో చెప్ప‌లేం.. రోజంతా అడుక్కుంటూ బ‌తికే ఓ బిచ్చ‌గాడికి బంప‌ర్ ఆఫర్ త‌గ‌లింది.. ఏపీలోని అనంత‌పురానికి చెందిన  పొన్న‌య్య (35) కు కేర‌ళ‌లోని అక్ష‌య లాట‌రీ లో రూ.65 ల‌క్ష‌ల లాట‌రీ త‌గిలింది. ఒక‌ప్పుడు పొన్న‌య్య తాపీ మేస్ర్తీ . ఓ ప్ర‌మాదంలో త‌న కాలును కోల్పోయాడు. ఊళ్లో ఉపాధి […]

బిచ్చ‌గాడికి రూ.65 ల‌క్ష‌ల లాట‌రీ
X
దేవుడు ఇవ్వాల‌నుకుంటే.. నిద్ర‌లో ఉన్నా లేపి చెంప మీద కొట్టి మ‌రీ ఇస్తాడు.. అని హిందీలో ఓ సామెత నిజ‌మైంది. ధ‌న‌ల‌క్ష్మి ఎప్పుడు ఎవ‌రి త‌లుపు త‌డుతుందో చెప్ప‌లేం.. రోజంతా అడుక్కుంటూ బ‌తికే ఓ బిచ్చ‌గాడికి బంప‌ర్ ఆఫర్ త‌గ‌లింది.. ఏపీలోని అనంత‌పురానికి చెందిన పొన్న‌య్య (35) కు కేర‌ళ‌లోని అక్ష‌య లాట‌రీ లో రూ.65 ల‌క్ష‌ల లాట‌రీ త‌గిలింది. ఒక‌ప్పుడు పొన్న‌య్య తాపీ మేస్ర్తీ . ఓ ప్ర‌మాదంలో త‌న కాలును కోల్పోయాడు. ఊళ్లో ఉపాధి చేసుకోలేని ప‌రిస్థితి. అందుకే కేర‌ళ వెళ్లి అక్క‌డ యాచ‌కుడిగా మారాడు. కానీ, ఏనాటికైనా తాను ల‌క్షాధికారిని కావాల‌నుకున్నాడు. అందుకే తాను యాచించి పోగు చేసిన డ‌బ్బులో కొంత కుటుంబానికి పంప‌గా.. మ‌రికొంత లాట‌రీ టికెట్ల‌కు వెచ్చించేవాడు. అత‌ని ఆశ‌లు వ‌మ్ము కాలేదు. ధ‌న‌ల‌క్ష్మి క‌రుణించింది. ఒకేసారి రూ.65 ల‌క్ష‌ల న‌గ‌దుతోపాటు రూ.90 వేల ఇత‌ర బ‌హుమ‌తులను సైతం గెలుచుకున్నాడు. విష‌యం తెలియ‌గానే పోలీసులు అత‌నికి భ‌ద్ర‌త క‌ల్పించారు.. ఎందుకంటే ఇప్పుడు పొన్న‌య్య ల‌క్షాధికారి..!
First Published:  1 April 2016 7:56 PM GMT
Next Story