Telugu Global
Health & Life Style

డిగ్రీ పూర్తి చేయ‌ని టెక్ దిగ్గ‌జాలు!

బాగా చ‌దివి డ‌బ్బు సంపాదించాలి…అని పిల్ల‌ల‌కు చాలామంది త‌ల్లిదండ్రులు నూరిపోస్తుంటారు. కాలేజీలు ఇచ్చే డిగ్రీలు లేక‌పోతే జీవితంలో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేర‌నేది అలాంటివారి న‌మ్మ‌కం. కానీ నిజాలు ఎప్ప‌డూ మ‌న న‌మ్మ‌కాల్లా ఉండ‌వు. టెక్నాల‌జీ రంగంలో దిగ్గ‌జాలుగా కోట్ల‌కొద్దీ సంప‌ద‌ని కూడ‌బెట్టిన వారిలోచాలామంది కాలేజి చ‌దువుని మ‌ధ్య‌లో ఆపేసిన‌వారే. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే కాలేజి ఎగ్గొట్టి త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేశారు. ఈ లిస్టులో ఎవ‌రెవ‌రు ఉన్నారో తేలిస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.  ఎందుకంటే కాలేజీ చ‌దువు […]

డిగ్రీ పూర్తి చేయ‌ని టెక్ దిగ్గ‌జాలు!
X

బాగా చ‌దివి డ‌బ్బు సంపాదించాలి…అని పిల్ల‌ల‌కు చాలామంది త‌ల్లిదండ్రులు నూరిపోస్తుంటారు. కాలేజీలు ఇచ్చే డిగ్రీలు లేక‌పోతే జీవితంలో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేర‌నేది అలాంటివారి న‌మ్మ‌కం. కానీ నిజాలు ఎప్ప‌డూ మ‌న న‌మ్మ‌కాల్లా ఉండ‌వు. టెక్నాల‌జీ రంగంలో దిగ్గ‌జాలుగా కోట్ల‌కొద్దీ సంప‌ద‌ని కూడ‌బెట్టిన వారిలోచాలామంది కాలేజి చ‌దువుని మ‌ధ్య‌లో ఆపేసిన‌వారే. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే కాలేజి ఎగ్గొట్టి త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేశారు. ఈ లిస్టులో ఎవ‌రెవ‌రు ఉన్నారో తేలిస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఎందుకంటే కాలేజీ చ‌దువు పూర్తి చేయ‌ని ఈ వ్య‌క్తుల కంపెనీల్లో కాక‌లు తీరిన విద్యావంతులు, మేధావులు ప‌నిచేస్తున్నారు మ‌రి. ఇంత‌కీ డిగ్రీలు లేని ఆ టెగ్ దిగ్గ‌జాలు ఎవ‌రో చూద్దామా-

ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ బెస్ట్ యూనివ‌ర్శిటీల్లో చేరాడు కానీ ఎక్క‌డా చ‌దువు పూర్తి చేయ‌లేదు. చ‌దువు పూర్తి కాకుండానే 20ఏళ్ల‌కే బ‌య‌ట‌కు వ‌చ్చేసి టెక్నాల‌జీ రంగంలో వ్యాపారాలు మొద‌లుపెట్టాడు. ఇప్పుడ‌త‌ను ఏ స్థాయిలో ఉన్నాడో అంద‌రికీ తెలుసు. యాపిల్ కంపెనీ స్థాప‌కుడు, ఛైర్మ‌న్ అయిన స్టీవ్‌జాబ్స్‌19వ ఏట కాలేజి చ‌దువు మానేశాడు. త‌రువాత టెక్నాల‌జీ రంగంలో అప్రతిహ‌తంగా కొన‌సాగాడు. క్యాన్స‌ర్ బారిన ప‌డినా ఐపాడ్‌, ఐఫోన్‌ల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాడు. చివ‌రి వ‌ర‌కు ప‌నిచేస్తూ 2011లో మ‌ర‌ణించాడు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ధ‌న‌వంతుడైన బిల్‌గేట్స్‌, మైక్రోసాఫ్ట్ అధినేత… 20ఏళ్ల వ‌య‌సులో కాలేజి చ‌దువుని మ‌ధ్య‌లోనే వ‌దిలేశాడు.

పిసిలు, ల్యాప్‌టాప్‌లు త‌యారుచేసే కంపెనీ స్థాప‌కుడు మైఖేల్ డెల్ 19 ఏళ్ల వ‌య‌సులో కాలేజి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌నదైన శైలిలో ముందుకు సాగాడు. డెల్ కంపెనీ టెక్ రంగంలో ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ట్విట్ట‌ర్ ని సృష్టించిన ఇవాన్ విలియం 20ఏళ్ల వ‌య‌సులో చ‌దువు ఆపేసి బిలియ‌న్ల కొద్దీ డాల‌ర్ల‌ను ఎలా సంపాదించాలి… అనే ప‌నిలో ప‌డిపోయాడు. చివ‌రికి వెబ్ సోష‌ల్ ప్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్‌తో సోష‌ల్ మీడియాలో ప్ర‌భంజ‌నం సృష్టించాడు. ప‌లుదేశాల్లో ఊబ‌ర్ ఆన్‌లైన్ ర‌వాణా కంపెనీలు న‌డుపుతున్న ట్రావిస్ క‌లానిక్ 21 ఏళ్ల వ‌య‌సులో కాలేజి చ‌దువు మ‌ధ్య‌లోనే ముగించేశాడు.

ఒరాకిల్ కంప్యూట‌ర్ టెక్నాల‌జీ కార్పొరేష‌న్‌ని స్థాపించిన లారీ ఇల్లీస‌న్ 20ఏళ్ల వ‌య‌సులో చ‌దువుకి టాటా చెప్పి వ్యాపారంలోకి వ‌చ్చేసి టెక్ దిగ్గ‌జంగా ఎదిగాడు. వాట్స‌ప్‌ సృష్టిక‌ర్త జాన్ కౌమ్ 21ఏళ్ల వ‌య‌సులో కాలేజి చ‌దువులు వ‌దిలేశాడు. ఫేస్‌బుక్ ఎంత పెద్ద‌మొత్తం చెల్లించి వాట్స‌ప్‌ని సొంతం చేసుకుందో మ‌నంద‌రికీ తెలుసు.

First Published:  1 April 2016 3:54 AM GMT
Next Story