Telugu Global
International

స్మార్ట్‌ఫోన్‌లో పాస్‌పోర్టు...కాగితాల‌కు చెక్‌!

టెక్నాల‌జీ మ‌నిషి నిత్య కృత్యాల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తూ పోతోంది. పెన్ను పేప‌ర్ల‌కు పూర్తిగా కాలం చెల్లిపోతున్న కాల‌మిది. అదే క్రమంలో పాస్‌పోర్టుల‌ను ఇక‌పై డిజిట‌ల్ రూపంలో స్మార్ట్‌ఫోన్లోనే భ‌ద్ర‌ప‌ర‌చే విధానాన్ని డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో ఉంది బ్రిట‌న్‌కి చెందిన డి లా ర్యూ కంపెనీ. పాస్‌పోర్టుల త‌యారీలో ఇది ప్ర‌పంచ‌లోనే అతిపెద్ద కంపెనీ. ఇప్ప‌టికే ప‌ర్యాట‌కులు విమానాల్లో ప్రయాణించేట‌ప్పుడు విస్తృతంగా వాడుతున్న మొబైల్ బోర్డింగ్ కార్డుల త‌ర‌హాలోనే దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ టెక్నాల‌జీ ప్ర‌స్తుతం […]

స్మార్ట్‌ఫోన్‌లో పాస్‌పోర్టు...కాగితాల‌కు చెక్‌!
X

టెక్నాల‌జీ మ‌నిషి నిత్య కృత్యాల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తూ పోతోంది. పెన్ను పేప‌ర్ల‌కు పూర్తిగా కాలం చెల్లిపోతున్న కాల‌మిది. అదే క్రమంలో పాస్‌పోర్టుల‌ను ఇక‌పై డిజిట‌ల్ రూపంలో స్మార్ట్‌ఫోన్లోనే భ‌ద్ర‌ప‌ర‌చే విధానాన్ని డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో ఉంది బ్రిట‌న్‌కి చెందిన డి లా ర్యూ కంపెనీ. పాస్‌పోర్టుల త‌యారీలో ఇది ప్ర‌పంచ‌లోనే అతిపెద్ద కంపెనీ. ఇప్ప‌టికే ప‌ర్యాట‌కులు విమానాల్లో ప్రయాణించేట‌ప్పుడు విస్తృతంగా వాడుతున్న మొబైల్ బోర్డింగ్ కార్డుల త‌ర‌హాలోనే దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ టెక్నాల‌జీ ప్ర‌స్తుతం ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉంది. ఇది పూర్తి స్థాయిలో కార్యాచ‌ర‌ణ‌కు రావ‌డానికి స‌మయం ప‌డుతుంద‌ని డి లా ర్యూ కంపెనీ ప్ర‌క‌టించింది. ఫోన్‌పోయిన‌పుడు త‌లెత్తే భ‌ద్ర‌తాప‌ర‌మైన స‌మ‌స్య‌లు, ఫోర్జ‌రీలాంటి స‌మ‌స్య‌ల‌ను ఇందులో భాగంగా ప‌రిశీలిస్తున్నారు. పాస్‌పోర్టుని భ‌ద్ర‌ప‌ర‌చిన ఫోన్ తాలూకూ డిజిట‌ల్ పాస్‌వ‌ర్డ్‌ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఇత‌రులు సంగ్ర‌హించ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై దృష్టి పెడుతున్నారు. మొత్తానికి ఇది ఆచ‌ర‌ణ‌లోకి రావ‌డానికి ఎక్కువ‌కాలం పట్ట‌కపోవ‌చ్చు.

First Published:  30 March 2016 9:00 PM GMT
Next Story