Telugu Global
Cinema & Entertainment

బాహుబలి-2లో మరో స్టార్ హీరో

బాహుబలి సినిమాలో ఇప్పటికే ఇద్దరు స్టార్లు ఉన్నారు. ప్రభాస్, రానా సినిమాకు రెండు పిల్లర్లుగా నిలిచారు. ఇప్పుడీ స్టార్ ఎట్రాక్షన్ ను మూడుకు పెంచాలని అనుకుంటున్నాడట రాజమౌళి. కథ ప్రకారం సినిమాలో జయదేవ్ రాణా అనే పాత్ర ఉందని, ఆ పాత్రకు తగ్గ హీరో కోసం రాజమౌళి వెదుకుతున్నాడని సమాచారం. నిజానికి బాహుబలి-2లో నటించడానికి ఎవరైనా సిద్దంగా ఉంటారు. బాలీవుడు, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఏ భాషలో హీరో అయినా రాజమౌళి అడిగితే కాదనడు. […]

బాహుబలి-2లో మరో స్టార్ హీరో
X

బాహుబలి సినిమాలో ఇప్పటికే ఇద్దరు స్టార్లు ఉన్నారు. ప్రభాస్, రానా సినిమాకు రెండు పిల్లర్లుగా నిలిచారు. ఇప్పుడీ స్టార్ ఎట్రాక్షన్ ను మూడుకు పెంచాలని అనుకుంటున్నాడట రాజమౌళి. కథ ప్రకారం సినిమాలో జయదేవ్ రాణా అనే పాత్ర ఉందని, ఆ పాత్రకు తగ్గ హీరో కోసం రాజమౌళి వెదుకుతున్నాడని సమాచారం. నిజానికి బాహుబలి-2లో నటించడానికి ఎవరైనా సిద్దంగా ఉంటారు. బాలీవుడు, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఏ భాషలో హీరో అయినా రాజమౌళి అడిగితే కాదనడు. మరీ ముఖ్యంగా సినిమాకు జాతీయ అవార్డు రావడంతో… పార్ట్-2పై అందరి కన్ను పడింది. కానీ రాజమౌళి మాత్రం మూడో హీరో కోసం చాలా ప్రత్యేకంగా గాలిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో పేరున్న కథనాయకుడి కోసం రాజమౌళి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే బాహుబలి-2 సినిమాలో నటించనున్న మూడో స్టార్ హీరోకు సంబంధించిన డీటెయిల్స్ బయటకొచ్చే అవకాశముంది.

First Published:  30 March 2016 10:34 AM GMT
Next Story