Telugu Global
National

అనుష్క పబ్లిక్ ప్రాపర్టీనా?

విరాట్ కోహ్లీ ఆడకపోయినా అనుష్కా శర్మనే తిట్టారు. ఇప్పుడు ఆదరగొడుతున్నా అనుష్కా శర్మనే ఆడిపోసుకుంటున్నారు. అభిమానం ఉండొచ్చు. కానీ ఇది హద్దులు దాటుతోంది. మరొకరికి అవమానం జరుగుతోంది. బ్రేక్ అప్ తర్వాత బౌన్స్ బ్యాక్ కామెంట్స్ అనుష్కతో బ్రేక్అప్ తర్వాతే విరాట్ బౌన్స్ బ్యాక్ అయ్యాడని..విశ్వరూపం ప్రదర్శించాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అడ్డమైన కామెంట్స్ చేస్తున్నారు. మా కోహ్లీని తిరిగిచ్చావంటూ ట్విట్టర్లో అడ్డమైన రాతలు రాస్తున్నారు. ఏం కోహ్లీ నోట్లో వేలుపెడితే కొరకడంరాని పసివాడా? అసలు వాళ్ళిద్దరి […]

అనుష్క పబ్లిక్ ప్రాపర్టీనా?
X

విరాట్ కోహ్లీ ఆడకపోయినా అనుష్కా శర్మనే తిట్టారు. ఇప్పుడు ఆదరగొడుతున్నా అనుష్కా శర్మనే ఆడిపోసుకుంటున్నారు. అభిమానం ఉండొచ్చు. కానీ ఇది హద్దులు దాటుతోంది. మరొకరికి అవమానం జరుగుతోంది.

బ్రేక్ అప్ తర్వాత బౌన్స్ బ్యాక్ కామెంట్స్

అనుష్కతో బ్రేక్అప్ తర్వాతే విరాట్ బౌన్స్ బ్యాక్ అయ్యాడని..విశ్వరూపం ప్రదర్శించాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అడ్డమైన కామెంట్స్ చేస్తున్నారు. మా కోహ్లీని తిరిగిచ్చావంటూ ట్విట్టర్లో అడ్డమైన రాతలు రాస్తున్నారు. ఏం కోహ్లీ నోట్లో వేలుపెడితే కొరకడంరాని పసివాడా? అసలు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కి, టీమిండియా జయాపజయాలకు సంబంధం ఏమిటి? చాలామంది సెలెబ్రిటీలు బ్రేక్అప్ అవుతున్నారు. కానీ ప్రతి సందర్భంలోనూ అమ్మాయిలే సాఫ్ట్ టార్గెట్! ఏం అనుష్కా శర్మ పబ్లిక్ ప్రాపర్టీనా?? అన్నిటికీ మించి ఆసిస్ పై వీర విహారం చేసిన కోహ్లీ కష్టానికి, కసికి కూడా గౌరవం ఇవ్వరా?

రియల్ హీరో
ప్రియురాలు దూరమైనా.. కోహ్లీ ప్రేమను దూరం చేసుకోలేదు. అనుష్కపై గౌరవం తగ్గలేదు. అందుకే ఆమె కోసం సోషల్ మీడియాలో బాటింగ్ చేసాడు. ఆమెపై చీప్ కామెంట్స్ చేయడాన్ని’షేమ్’ అంటూ అసహ్యించుకున్నాడు. అనుష్క ఎప్పుడూ తనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తూనే ఉందని…ఆమె గౌరవం కాపాడాడు. రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకున్నాడు.

First Published:  28 March 2016 11:30 PM GMT
Next Story