Telugu Global
Cinema & Entertainment

కాశ్మీర్ లో న‌య‌న‌తార‌..విక్ర‌మ్..?

డైరెక్ట‌ర్ శంక‌ర్ తో చేసిన ఐ చిత్రం త‌న కెరీర్ కు మంచి స్పీడ్ ఇస్తుంద‌ని విక్ర‌మ్ ఎంతో క‌ష్ట‌ప‌డి చేశాడు. ఆ సినిమా కోసం ఆయ‌న ఫిజిక‌ల్ గా ప‌డిన క‌ష్టం మాములుది కాదు. ద‌ర్శ‌కుడు శంక‌ర్ విక్ర‌మ్ తో ఒక విధంగా పెద్ద ప్ర‌యోగ‌మే చేశాడ‌ని చెప్పాలి. బ‌రువు పెంచ‌డం. త‌గ్గించ‌డం.. ఎంతో శ్ర‌ద్ద‌గా దాదాపు 3 సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి గొప్ప‌గా తీశారు. కానీ క‌థ ప‌రంగా అభిమానుల్ని పెద్ద‌గా మెప్పించ‌లేక పోవ‌డంతో చిత్రం […]

కాశ్మీర్ లో న‌య‌న‌తార‌..విక్ర‌మ్..?
X

డైరెక్ట‌ర్ శంక‌ర్ తో చేసిన ఐ చిత్రం త‌న కెరీర్ కు మంచి స్పీడ్ ఇస్తుంద‌ని విక్ర‌మ్ ఎంతో క‌ష్ట‌ప‌డి చేశాడు. ఆ సినిమా కోసం ఆయ‌న ఫిజిక‌ల్ గా ప‌డిన క‌ష్టం మాములుది కాదు. ద‌ర్శ‌కుడు శంక‌ర్ విక్ర‌మ్ తో ఒక విధంగా పెద్ద ప్ర‌యోగ‌మే చేశాడ‌ని చెప్పాలి. బ‌రువు పెంచ‌డం. త‌గ్గించ‌డం.. ఎంతో శ్ర‌ద్ద‌గా దాదాపు 3 సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి గొప్ప‌గా తీశారు. కానీ క‌థ ప‌రంగా అభిమానుల్ని పెద్ద‌గా మెప్పించ‌లేక పోవ‌డంతో చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది.

ఇక తాజాగా విక్ర‌మ్ ఆనంద్ శంక‌ర్ అనే ద‌ర్శ‌కుడితో ఇరు మగ‌న్ అనే చిత్రం చేస్తున్నాడు. యాక్ష‌న్, ల‌వ్ అంశాల్ని మేళ‌వించి ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని చేస్తున్నారు. విక్ర‌మ్ స‌ర‌స‌న‌.. హాట్ బ్యూటీ న‌య‌న‌తార న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్ కు చెక్కేశార‌ట‌. అక్క‌డ కొన్ని అంద‌మైన లోకేష‌న్స్ లో మంచి సాంగ్స్ ను షూట్ చేస్తున్నార‌ట‌. శేషు, శివ‌పుత్రుడు, అప‌రిచితుడు, చిత్రాల‌తో అల‌రించిన విక్ర‌మ్ కు ఈ చిత్రం అయిన మంచి హిట్ ఇస్తుందో లేదో అభిమానులు కలవరపడుతున్నారట.

First Published:  26 March 2016 8:22 PM GMT
Next Story