Telugu Global
WOMEN

బీడీలు చుడుతూ...ఖాళీ స‌మ‌యాల్లో కంప్యూట‌ర్ నేర్చుకుంటూ...

టెక్నాల‌జీ అనేది మ‌నుషులు ఉప‌యోగించుకోవ‌డానికే ఉంది. అవ‌స‌రం ఉన్న‌వారు ఎవ‌రైనా దాన్ని వినియోగించుకోవ‌చ్చు. నేర్చుకోవాల‌నే ఆస‌క్తి ఉండాలే కానీ, అందుకు వ‌య‌సు, చ‌దువు లాంటి అంశాలు, అర్హ‌త‌లు అడ్డురావు. క‌రీంన‌గ‌ర్‌కి చెందిన కోరుట్ల‌ స‌త్తెమ్మ అదే నిరూపించింది. 58 సంవ‌త్స‌రాల స‌త్తెమ్మ బీడీలు చుడుతూ ఉపాధి పొందుతోంది. అయితే ఖాళీ స‌మ‌యంలో ఆమె మ‌రొక ప‌నికూడా చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం  డిజిట‌ల్ అక్ష‌రాస్యతా కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హిస్తున్న భార‌తీ ఆన్‌లైన్ స‌ర్వీస్‌లో చేరి కంప్యూట‌ర్ పాఠాలు నేర్చుకుంటోంది. […]

బీడీలు చుడుతూ...ఖాళీ స‌మ‌యాల్లో కంప్యూట‌ర్ నేర్చుకుంటూ...
X

టెక్నాల‌జీ అనేది మ‌నుషులు ఉప‌యోగించుకోవ‌డానికే ఉంది. అవ‌స‌రం ఉన్న‌వారు ఎవ‌రైనా దాన్ని వినియోగించుకోవ‌చ్చు. నేర్చుకోవాల‌నే ఆస‌క్తి ఉండాలే కానీ, అందుకు వ‌య‌సు, చ‌దువు లాంటి అంశాలు, అర్హ‌త‌లు అడ్డురావు. క‌రీంన‌గ‌ర్‌కి చెందిన కోరుట్ల‌ స‌త్తెమ్మ అదే నిరూపించింది. 58 సంవ‌త్స‌రాల స‌త్తెమ్మ బీడీలు చుడుతూ ఉపాధి పొందుతోంది. అయితే ఖాళీ స‌మ‌యంలో ఆమె మ‌రొక ప‌నికూడా చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం డిజిట‌ల్ అక్ష‌రాస్యతా కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హిస్తున్న భార‌తీ ఆన్‌లైన్ స‌ర్వీస్‌లో చేరి కంప్యూట‌ర్ పాఠాలు నేర్చుకుంటోంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో అంద‌రికంటే పెద్ద‌వ‌య‌సున్న విద్యార్థిని ఆమే.

ఇప్పుడు అత్య‌వ‌స‌రంగా ఆమెకు ఈ ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది అనుకుంటున్నారా…దుబాయ్‌లో ఉంటున్న త‌న కొడుకుతో వీడియోకాల్‌లో మాట్లాడాలంటే ఎప్పుడూ ఎవ‌రోఒక‌రిమీద ఆధార‌ప‌డాల్సిరావ‌డంతోనే స‌త్తెమ్మ‌కు ఈ కొత్త ఆలోచ‌న వ‌చ్చింది. ఎవ‌రి స‌హాయం లేకుండా త‌న‌కు తానుగా స్మార్ట్‌ఫోన్లో కొడుకుతో వీడియో కాల్‌లో మాట్లాడుకోవాల‌నే ధృడ నిశ్చ‌యంతో కంప్యూట‌ర్ విద్య‌లో చేరింది. ఆమెలోని ఆస‌క్తి, నేర్చుకోవాల‌నే ప‌ట్టుద‌ల ఆమెకు ఓ చ‌క్క‌ని గుర్తింపుని కూడా తెచ్చిపెట్టాయి. స‌త్తెమ్మ విష‌యం తెలుసుకున్న కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్, స్వ‌యంగా ఆమెకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఈ విష‌యాన్ని ఫేస్‌బుక్‌లో వెల్ల‌డించిన కేంద్ర‌మంత్రి, ఆమె త‌న‌ తోటి మ‌హిళ‌లను కూడా కంప్యూట‌ర్ విద్య నేర్చుకునేందుకు ప్రోత్స‌హించాల‌ని తాను స‌త్తెమ్మని కోరిన‌ట్టుగా తెలిపారు.

First Published:  27 March 2016 5:18 AM GMT
Next Story